RetroFiles: ఎందుకీ ఫేక్ పోస్టర్లు? ప్రొడ్యూసర్ల వ్యూహం వేరే ఉందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రీసెంట్ గా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి మూడు రోజులు భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ సినిమా ఆ తర్వాత నెమ్మదించింది. ఒక్క సారిగా కలెక్షన్లు డౌన్ అవ్వడంతో చిత్ర యూనిట్ వసూళ్లు పెంచడానికి శత విధాలా ప్రయత్నిస్తుంది. మొన్నామధ్య స్పెషల్ ఆఫర్లంటూ మల్టీఫ్లెక్స్ లలో 150 రూపాయలకే చూస్తున్నారని ఆఫర్లు పెట్టారు.

అయినా ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ సారి కేవలం 112 రూపాయలకే టికెట్ అంటూ మల్టీఫ్లెక్స్ లో బోర్డులు పాతి మరి పెట్టారు. అయినా ఒక్కడు థియేటర్ల వైపు చూడట్లేదు. కానీ తమ సినిమా పోస్టర్లపై మాత్రం కలెక్షన్లు హౌస్ ఫుల్ అవుతున్నాయని పోస్టర్లు వదులుతున్నారు. తాజాగా ఆదిపురుష్ కలెక్షన్లు ఏకంగా 450 కోట్లు దాటేసిందని చిత్ర యూనిట్ పోస్టర్స్ రిలీజ్ చేసింది. నిజానికి ఆదిపురుష్ విడుదలైన 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 370 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే దాదాపు 80 కోట్ల తేడా చుపించారన్నమాట.

మరి ప్రొడ్యూసర్లు ఎందుకింత ఫేక్ కలెక్షన్లు చూపిస్తూ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారో అర్థంకావట్లేదు. అయితే ఈ ఫేక్ కలెక్షన్ల ప్రచారం వాళ్ళ తెలుగు హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. దీని గురించి బాలీవుడ్ వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోయినా టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లకైతే తెలిసిందే. మరి ఎందుకు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారో తెలియడం లేదు. అయితే కొంతమంది ట్రేడ్ విశ్లేషకులు ఈ సినిమా యొక్క పోస్టర్లపై పలు రకాలుగా అంటున్నారు. ఆదిపురుష్ సినిమా నిర్మాతలు తమపై ఇన్ కం టాక్స్ రైడింగ్ లు జరగకుండా తమ వద్ద ఉండే అక్రమ డబ్బులను ఈ కలెక్షన్లలో జత చేసి చూపిస్తున్నారని అంటున్నారు.

- Advertisement -

ఇదంతా ప్రొడ్యూసర్ల ప్లానింగ్ లో భాగమేనని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదుగాని ఈ ఫేక్ పోస్టర్ లతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ నడుస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు