BRO: టైమ్ లేదు? అందుకే సినిమాల్లోనూ పార్టీని గుర్తు చేస్తున్నాడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు యమా బిజీ గా ఉన్నాడు. కొన్నాళ్ల వరకు సినిమాలతో బిజీ గా ఉంటూ రోజుకో సినిమా సెట్స్ లో ఉండేవాడు. అందుకే నాలుగు సినిమాల షూటింగ్ లు ఒకేసారి జరిగేవి. అయితే పవన్ కళ్యాణ్ మొన్నటివరకు షూటింగ్ లోనే ఉన్నా, ప్రస్తుతం తన పార్టీ అయిన జనసేన కార్యక్రమాల్లో బిజీ అయ్యాడు. ఇది గమనించిన ప్రొడ్యూసర్లు అటు పవన్ కి ఇటు తమ సినిమాలకి ఇబ్బంది కలగకుండా తమ సినిమా షూట్లను జనసేన ప్రచారం నిర్వహించే చోట్లే సెట్స్ వేస్తూ షూట్ చేస్తున్నారు.

అయితే ఎలక్షన్ల టైమ్ దగ్గర పడుతుండడంతో ప్రతి చోట తన పార్టీని గుర్తు చేసేలా ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు అది సినిమాల వరకు వచ్చింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన “బ్రో” పోస్టర్ లో పవన్ కళ్యాణ్ రైల్వే కూలీ గెటప్ లో ఉన్న స్టిల్ వదిలారు. ఆ స్టిల్ లో పవన్ కళ్యాణ్ చేతి పైన ఒక బ్యాచ్ తగిలించుకోగా ఆ బ్యాచ్ పైన జనసేన పార్టీ జెండా గుర్తు ఉండటం గమనించవచ్చు. ఇలాంటివి ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లో చూపించడం జరిగింది. ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ కి ప్లస్ పాయింట్ అయినా ఇతర పార్టీ ల వాళ్ళు పవన్ సినిమాను విడుదల కాకుండా అడ్డుకునే అవకాశం ఉంది.

2021 లో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ లో ఒక సీన్ లో పవన్ కళ్యాణ్  టీ తాగడం చూసే ఉంటారు. ఇక జనసేన పార్టీ ఓటు గుర్తు టీ గ్లాస్ కావడం విశేషం. ఆ విధంగా సినిమాల్లోనూ తన పార్టీ గుర్తులతో కొత్త రకంగా ప్రమోట్ చేసుకుంటున్నాడన్నమాట. ఇక పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా ఆ సినిమాను జులై 28న విడుదల చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు