Nikhil: స్పై వరల్డ్ వైడ్ బిజినెస్ డీటెయిల్స్ .. తక్కువే? కానీ సేఫ్!

టాలెంటెడ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం “స్పై”. కార్తికేయ2 తర్వాత నిఖిల్ నుండి విడుదలవుతున్న పాన్ ఇండియా సినిమా కావడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ఇంకా ట్రైలర్ కూడా ఆకట్టుకోవడమే గాక, “స్పై” పై ఉన్న అంచనాలను రెట్టింపు చేసాయి. ఇక ఈ సినిమా కి సంబంచింది అన్ని చోట్ల ప్రమోషన్లు చేస్తున్నారు చిత్ర యూనిట్.

అయితే “స్పై” సినిమాకి సంబంధించి వరల్డ్ వైడ్ బిజినెస్ డీటెయిల్స్ సమాచారం వచ్చింది. 30 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చేసిన బిజినెస్ ఏరియా వారి లెక్కలు ఇవే..

నైజాం 5 కోట్లు, సీడెడ్2కోట్లు, ఆంధ్ర మొత్తం 6కోట్లు, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 70 లక్షలు, ఓవర్సీస్ లో 1. 80 కోట్లు జరిగింది. ఇక స్పై సినిమాకు ఇతర భాషలన్నీ కలిపి 2 కోట్లు జరిగింది. ఓవరాల్ గా “స్పై” సినిమా వరల్డ్ వైడ్ గా 17. 50 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

- Advertisement -

అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే 18. 50 కోట్లు రాబట్టాలన్నమాట. అయితే “స్పై” సినిమా కు ఇతర భాషల్లో పెద్దగా ప్రమోషన్లు చేయలేకపోవడం వల్ల హిందీలో ఎక్కువ బిజినెస్ కూడా జరగలేదు. అయితే ఈ సినిమా కంటెంట్ బాగుంటే కార్తికేయ 2 లాగా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. మరి “స్పై” సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందో తెలియాలంటే జూన్ 29 వరకు వెయిట్ చేయాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు