Pawan kalyan: ఎట్టకేలకు అప్డేట్ వచ్చేసింది? వింటేజ్ పవన్ కళ్యాణ్ బ్యాక్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో “బ్రో” అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పార్ట్ షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తయిపోగా, సాయి ధరమ్ తేజ్ యొక్క సీన్లు కూడా షూట్ చేసేస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయినా “బ్రో” నుండి పోస్టర్లు వదలడం తప్ప సాంగ్ గాని, టీజర్ గాని విడుదల చేయలేదు. కేవలం నెల రోజులు మాత్రమే టైమ్ ఉండడంతో ఇన్ని రోజులు అభిమానులు చాలా కోపంగా ఉన్నారు.

అయితే అభిమానుల నిరీక్షణకి తెర దించుతూ చిత్ర యూనిట్ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. “బ్రో” యొక్క టీజర్ ని రిలీజ్ చేస్తున్నామని ఒక సాలిడ్ పోస్టర్ వదులుతూ చిత్ర యూనిట్ చెప్పారు. అయితే ఆ పోస్టర్ లో మామ, అల్లుళ్లిద్దరూ రైల్వే కూలి డ్రెస్సుల్లో స్టైల్ గా పోజులిస్తూ నిలబడ్డారు. ఇక పవన్ అయితే తాను నటించిన తమ్ముడు సినిమా సాంగ్ లో కనిపించిన లుంగీ డ్రెస్ లో నోట్లో బీడీతో కనిపించాడు. ఈ లుక్ లో అచ్చం తమ్ముడు సినిమాలో కనిపించిన డ్రెస్ లాగే ఉండడంతో పీకే ఫ్యాన్స్ వింటేజ్ పవర్ స్టార్ బ్యాక్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక బ్రో సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నామని చెప్పినా అందులో డేట్ టైం చెప్పలేదు. కానీ ట్రేడ్ రిపోర్టర్ల సమాచారం ప్రకారం టీజర్ ని జూన్ 28న సాయంత్రం రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. ఏది ఏమైనా ఫ్యాన్స్ కి చాలా రోజుల తర్వాత మంచి ట్రీట్ ఇవ్వనున్నారని అర్థమైపోయింది. ఇక బ్రో సినిమాని జులై 28న విడుదల చేస్తున్నారన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు