Ranga Marthaanda: మేకర్స్ కి రంగమార్తాండ ఇచ్చిన మెసేజ్ ఏమిటీ..?

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం రంగమార్తాండ. మరాఠి సినిమా నటసామ్రాట్ కు రీమేక్ గా రూపొందిన సినిమా ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకొని మంచి సినిమాగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. మంచి సినిమా అన్న పేరు, ప్రశంసలు అయితే దక్కించుకుంది కానీ, ప్రశంసలను వసూళ్లుగా మలుచుకోలేకపోయింది రంగమార్తాండ సినిమా. కంటెంట్ బేస్డ్ సినిమా కావటంతో జనాల్లోకి తీసుకెళ్లటం కోసం సినిమా యూనిట్ రిలీజ్ కి ముందే ప్రీమియర్స్ వేసి ప్రమోషన్స్ చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేక పోయింది.
రంగమార్తాండ సినిమా చుసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వటమే కాకుండా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లతో పాటు మిగతా పత్రాలు పోషించిన అందరూ బాగా నటించారన్న కితాబిచ్చారు. ప్రీమియర్స్ దగ్గర నుండి రిలీజ్ అయ్యాక చుసిన ప్రతి ఒక్కరు ఈ సినిమాను పొగిడినవారే అయినప్పటికీ కలెక్షన్స్ రాబట్టలేకపోవటం మారుతున్న ప్రేక్షకుల మైండ్ సెట్ నిదర్శనం అని చెప్పాలి. థియేటర్ కు ప్రత్యామ్నాయంగా టీవీ స్మార్ట్ ఫోన్ వచ్చిన రోజులు ఇవి, ఇలాంటి సమయంలో ఎలాంటి కమర్షియల్ హంగులు లేని ఇలాంటి జెన్యూన్ కంటెంట్ ఉన్న సినిమాలను థియేటర్ కు వచ్చి చూసేంత తీరిక జనాలకు లేకపోయింది.
థియేటర్లలో ఎక్కువ మంది చూడని ఈ సినిమాను ఓటీటీకి వచ్చాక థియేటర్లో కంటే ఎక్కువ చూస్తున్నారు. సినిమా చుసిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పొగుడుతూ ఉండటం చుస్తే ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసుంటే బాగుండేది అన్న అభిప్రాయం వస్తుంది. ఈ సినిమా రిజల్ట్ చూసాకనైనా మేకర్స్ థియేటర్ సినిమా, ఓటీటీ సినిమాగా ఆడియెన్స్ డివైడ్ అయ్యారన్నది గ్రహించాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు