Bobby: ఆ యంగ్ డైరెక్టర్ కి అదృష్టం కలిసొచ్చిందా..?

డైరెక్టర్ బాబీ కొల్లి, రవితేజ హీరోగా వచ్చిన పవర్ సినిమాతో డైరెక్టర్ గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి వరుసగా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ సంపాదిస్తూ కమర్షియల్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. పవర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన జై లవకుశ సినిమా ఓకే అనిపించినప్పటికీ ఆశించిన రేంజ్ లో హిట్ అవ్వలేదు. ఆ తర్వాత వెంకటేష్ నాగచైతన్యలతో వెంకీ మామ లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ తీసినప్పటికీ పెద్దగా ఫలితం  లేకపోయింది.
పవర్ మినహా చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేనప్పటికీ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టిన బాబీ వాల్తేరు వీరయ్యతో ఎట్టకేలకు హిట్ అందుకొని తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా హిట్ ఇచ్చిన జోష్ లో ఉన్న బాబీ మరో లక్కీ ఛాన్స్ కొట్టేసాడు. అదేంటంటే, దిల్ రాజు నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించనున్న సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్. ఇంకా అధికారికంగా ప్రకటన రానప్పటికీ ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అన్న వార్తలొస్తున్నాయి.
బాబీ వరుసగా స్టేర్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం పొందటం గురించి నెటిజన్స్ ‘బాబీ నక్క తొక్కినట్టు ఉన్నాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ మాత్రమే తీసిన బాబీ రజినీ కోసం ఎలాంటి కథ సిద్ధం చేస్తాడు, ఇంకా అధికారికంగా కన్ఫామ్ కానీ ప్రాజెక్ట్ ఎప్పటికి కార్యరూపం దాల్చుతుంది అన్నది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు