Prabhas: ప్రభాస్ సినిమా కోసం పవర్ ఫుల్ టైటిల్..!

రాధేశ్యామ్ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు తన లైనప్ లో ఉన్న సినిమాలను ఒక్కొకటి పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే ప్రభాస్ లిస్ట్ ఉన్న లిస్ట్ లో ఉన్న సినిమాలన్నీ భారీతనంతో కూడుకున్నవే కానీ మారుతీ డైరెక్షన్లో రాబోయే సినిమా మాత్రం రెఫ్రెషింగ్ గా ఉండబోతోంది అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు రాజా డీలక్స్ అన్న టైటిల్ ఫిక్స్ చేసారని ప్రచారం జరుగుతోంది కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అది వాస్తవం కాదని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి గాను డైరెక్టర్ మారుతీ మూడు పవర్ఫుల్ టైటిల్స్ ను లోగోతో సహా రెడీ చేయించి ప్రభాస్ కు చూపించగా అవి మూడు ప్రభాస్ కు నచ్చాయని సమాచారం.
పాన్ ఇండియా సినిమా కావటం వల్ల అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకొని టైటిల్ ఫిక్స్ చేశారట. త్వరలోనే ఆ మూడు టైటిల్స్ లో ఎదో ఒకటి ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ ప్రమోషన్స్ హడావుడి ముగిసాక మారుతీ, ప్రభాస్ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది.
ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అయిన మారుతీ డైరెక్షన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలకంటే భిన్నంగా ఉండనుంది అన్న టాక్ రావటంతో అటు ఫ్యాన్స్, ఇటు నార్మల్ ఆడియెన్స్ లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి, మారుతీ రెడీ చేసిన ఆ టైటిల్స్ ఏవి?, వాటిల్లో ఏ టైటిల్ ను ఫైనలైజ్ చేస్తారు అన్నది తెలియాలంటే అనౌన్స్మెంట్ వరకు వేచి చూడాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు