#SSMB29: క్రేజీ బ్యాక్డ్రాప్ లో రాజమౌళి ప్లాన్..!

RRR సినిమాతో తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్ గా మారిపోయారు. ప్రస్తుతం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్లో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండి రోజుకో ఇంట్రస్టింగ్ అప్డేట్ తో వార్తల్లో నిలుస్తూ వస్తుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో మూడు భాగాల్లో రూపొందనున్న ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ కూడా సిద్ధం చేసారని సమాచారం. హనుమంతుడి ఇన్స్పిరేషన్ తో మహేష్ క్యారెక్టర్ డిజైన్ చేశారన్న వార్త సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా వినిపిస్తున్న టాక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంది.
వివరాల్లోకి వెళితే అడ్వెంచరస్ జానర్ లో ఉండబోయే ఈ సినిమాను రాజమౌళి ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రూపొందించనున్నారట. ఇదే ప్రస్తుతం టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది. ఇదే గనక నిజం అయితే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లు విజువల్ వండర్ గా నిలిచే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ జూన్, జులైలో కానీ, ఈ ఏడాది చివర్లో కానీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
పాన్ వరల్డ్ లెవెల్లో భారీ వీఎఫెక్స్ తో రూపొందనున్న ఈ సినిమా రైట్స్ ను సోనీ పిక్చర్స్, లేదా డిస్ని ప్లస్ సంస్థలు చేజిక్కించుకున్నాయని వార్తలొచ్చాయి. ఈ సినిమాకు సంబందించిన వీఎఫెక్స్ వర్క్స్ కోసం హాలీవుడ్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారని సమాచారం. భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా గురించి ఇంకెన్ని షాకింగ్ అప్డేట్స్ వినిపిస్తాయో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు