Samantha :శాకుంతలం ప్రీమియర్ షో రివ్యూ లు వచ్చేసాయి

ప్రస్తుతం ఇండస్ట్రీ అంత “శాకుంతలం” సినిమా ఎలా ఉండబోతుందా అనే వెయిటింగ్ లో ఉంది. సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకి మా తెలుగులో రీచ్ చాలా తక్కువ. ఈ స్టేట్మెంట్ ని నిజం చేస్తూ చాలా వరకు మన తెలుగులో వచ్చిన విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని అందుకోలేక పోయాయి.

అప్పుడప్పుడో వచ్చిన అరుంధతి తప్ప మళ్ళి ఆ రేంజ్ సక్సెస్ అయినా విమెన్ ఓరియెంటెడ్ సినిమా ఒక్కటి కూడా లేదు. అందుకే మన తెలుగు ప్రొడ్యూసర్స్ , డైరెక్టర్స్ ఇలాంటి కథలు సినిమాలుగా మలచడానికి చాలా ఆలోచిస్తారు.ఒకవేళ కథ బాగుండి చేసిన కూడా లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా కంప్లిట్ చేసేలా చూసుకుంటారు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో గుణ శేఖర్ , సమంతని నమ్మి భారీ బడ్జెట్ తో “శాకుంతలం “అనే సినిమాని తీశారు.

గతం లో కూడా ఈయన ఇలాంటి ప్రయోగమే చేసారు.అనుష్క ని లీడ్ రోల్ గా పెట్టి “రుద్రమదేవి “అనే సినిమా తీశారు. ఈ సినిమా కూడా అప్పుడు భారీ బడ్జెట్ తో తీసిన చిత్రమే . అల్లు అర్జున్ , రానా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలలో నటించారు. ప్రయత్నం బాగుంది అని మెచ్చుకున్నారు కానీ కలెక్షన్స్ మాత్రం రాలేదు. అప్పటికే బాహుబలి లాంటి విజువల్ గ్రాండియర్ సినిమా చూసేసిన ప్రేక్షకులకి రుద్రమదేవి రుచించలేదు.

- Advertisement -

ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. గతం తో పోలిస్తే ప్రేక్షకుల అంచనాలు ఇప్పుడు తార స్థాయికి వెళ్లాయి. తు తు మత్రంగా తీసే సినిమాలన్నిటిని ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. ఇక మరి శాకుంతలం సినిమా విషయానికొస్తే ఇది కాళిదాస్ రాసిన “అభిజ్ఞాన శాకుంతలం”ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. పోగుట్టున్న దగ్గరే వెతుక్కోవాలి అనే సామెత బాగా ఆకళింపు చేసుకున్న గుణ శేఖర్ రుద్రదేవితో దెబ్బ తిన్న కూడా మళ్ళీ అదే ఫీమేల్ ఓరియెంటెడ్ కథ తో , అదే హిస్టారికల్ బ్యాక్డ్రాప్ తో వస్తున్నారు.

శాకుంతలం సినిమా 14న రిలీజ్ అవుతుండంతో సినిమా ప్రీమియర్ షో లు ముందు రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. అయితే అంతట రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా వస్తోంది. విజువల్స్ చాల బాగున్నాయి. ఈతరం యూత్ కి మంచి మెసేజ్ ఇచ్చారు అంటూ ప్రీమియర్ షో చుసిన ప్రేక్షకులు గుణ శేఖర్ అండ్ టీం ని కంగ్రాట్యులేట్ చేస్తున్నారు. ఇక సమంత శాకుంతల పాత్రలో జీవించేసింది అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. మరి ఇదే టాక్ రేపు కూడా ఉంటుందో లేక మారుతుందో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు