Tollywood: అలా ఉండే స్టార్ హీరోయిన్.. ఎలా మారిపోయింది

ఇలియానా. టాలీవుడ్ లో ఒకప్పుడు సెన్సేషన్ పేరు. యూత్ క్రష్ లిస్ట్ లో ఉండే ఫస్ట్ హీరోయిన్ ఇలియానా. 2006 లో దేవదాసు సినిమాతో తెలుగులో పరిచయమైంది ఈ అమ్మడు. మొదటి సినిమా తోనే సూపర్ హిట్ కొట్టి పెద్ద ఆఫర్లు అందుకుంది. పోకిరి సినిమా తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అప్పటి యూత్ ని తన గ్లామర్ తో పడగొట్టింది. 2, 3 సినిమాలతోనే ఈ హీరోయిన్ 1 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ టాప్ స్టార్స్ సరసన నటించింది. జల్సా, కిక్, ఆట, జులాయి లాంటి సినిమాలతో తన టాలీవుడ్ లో తన జోరు చూపించింది.

అయితే ఆ తర్వాత 2012 లో వచ్చిన దేవుడు చేసిన మనుషులు సినిమా డిజాస్టర్ అయ్యాక బాలీవుడ్ ఆఫర్స్ కోసం తెలుగు ప్రేక్షకులకి దూరం అయింది. మొదటి సినిమా బర్ఫీ తో మంచి హిట్ వచ్చినా, తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా ఆడకపోవడంతో ఆఫర్లు రావడం తక్కువయ్యాయి. ఆ తర్వాత 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ద్వారా తెలుగులో రే ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా కూడా డిజాస్టర్ అవడం తో ఇలియానా కెరీర్ చాలా డౌన్ అయింది.

హిందీ లో ప్రస్తుతం అన్ ఫెయిర్&లవ్లీ అనే సినిమాలో నటిస్తుంది. ఇక అప్పుడప్పుడూ ప్రైవేట్ సాంగ్స్ లోను నటిస్తుంది. అయితే తాజాగా హిందీ లో నిన్న పాపులర్ ప్రైవేట్ ఆల్బం సింగర్ అయిన గోల్డ్ కార్ట్జ్, బాద్షా సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో మెయిన్ లీడ్ గా ఇలియానా నటించింది. అయితే సబ్ గజబ్ అనే పేరు తో ఉన్న ఆ సాంగ్ చూసిన వ్యూయర్స్ చాలా సేపటివరకు ఇలియానా ని గుర్తుపట్టలేదు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ తనని అసలు పోల్చుకోలేకపోయారు. ఒకప్పుడు జీరో సైజు నడుముతో యూత్ ని తన వైపు లాగేసుకున్న ఈ సుందరి ఇప్పుడు బొద్దుగా కూడా కాక మరింత లావుగా తయారయ్యి కనిపిస్తుంది. ఎలా ఉండే హీరోయిన్ ఎలా అయిపోయిందంటూ ఆశ్యర్యపోతున్నారు. ఇకనైనా ఇలియానా ఇది గమనించి తను సన్నబడితే చిన్న హీరోల తో అయినా మూవీ చేయవచ్చని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు