Marriage : ఇప్పుడు కీర్తి సురేష్

కీర్తి సురేష్ అంటే సౌత్ లో తెలియని వారుండరు. సీనియర్ హీరోయిన్ మేనక కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన కీర్తి సురేష్, ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో చేసిన కీర్తి, విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ పాత్రకు గాను కీర్తి సురేష్ కు జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసింది. ప్రస్తుతం ఈ అమ్మడు లేడీ వేరియెంటెండ్ సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది. ఈ చిత్రాలతో ఆశించిన విజయాలు రాకపోయినా, క్రేజ్ కు మాత్రం ఎలాంటి నష్టం జరగడం లేదు.

ఇక అది అలా ఉంటే సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మామూలుగా హీరోయిన్ల పెళ్లిపై సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పుకార్లు వస్తుంటాయి. ఇటీవల హీరోయిన్ హన్సిక పెళ్లిపై వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ రాకముందే ఇప్పుడు కీర్తి సురేష్ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం.. తల్లిదండ్రులు నిశ్చయించిన వరుడితో ఏడు అడుగులు వేయటానికి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కీర్తి సురేష్ కుటుంబం నుంచి త్వరలోనే వస్తుందని కోలీవుడ్ లో వినిపిస్తుంది. కాగా కీర్తిని చేసుకుబోయేవాడు ఒక పెద్ద వ్యాపారవేత్త అని తెలుస్తుంది. అలాగే తమిళనాడు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని సమాచారం అందుతుంది. అయితే వరుడి విషయంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కీర్తి వయసు ప్రస్తుతం కేవలం 29 మాత్రమే. అప్పుడే పెళ్లి పీటలు ఎక్కడానికి కీర్తి రెడీగా ఉందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. హీరోయిన్లు 30 నుంచి 35 ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్లి చేసుకోరు. కీర్తికి ప్రస్తుతం అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఈ టైంలో పెళ్లి చేసుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు