Salman Khan: పందిలా తింటాడు.. సల్మాన్ పై షాకింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ కండల వీరుడిగా, సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ తన సినిమాలతోనే కాదు సామాజిక సేవా కార్యక్రమాలతో కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు.. అలాంటి ఈయనను ఆయన ఫ్రెండ్ పందిలా తింటాడు అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.. అసలు విషయం ఏమిటో..? ఆ ఫ్రెండ్ ఎవరో..? ఎందుకలా అన్నారో ? అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం..

విందు దార కామెంట్స్..
సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ ఎవరో కాదు నటుడు విందు దార సింగ్.. వీరిద్దరూ కాలేజీ నుంచి స్నేహితులు.. చదువుకునే రోజుల్లో మొదలైన వీరి స్నేహం.. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.. తాజాగా విందు దార సల్మాన్ గురించి కొన్ని రహస్యాలను బయటపెట్టారు. సల్మాన్ ఖాన్ గురించి విందు మాట్లాడుతూ.. నా శరీరాకృతి చూశాక సల్మాన్ ఖాన్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయడం మొదలుపెట్టాడు.. ఈ విషయాన్ని ఎప్పుడూ నాతో చెబుతూ ఉంటాడు.. ముఖ్యంగా నన్ను చూసే ఆయన ఎక్కువ సేపు జిమ్ లో గడపడం ప్రారంభించాడు.. తిండి విషయంలో కూడా అంతే.. పందిలా తింటాడు.. కుక్కల ఎక్సర్ సైజ్ చేస్తాడు..

పందిలా తింటాడు..
నాకంటే కూడా చాలా ఎక్కువ తింటాడు.. తిన్నదంతా ఎక్కడకి పోతుంది అని అడిగితే మాత్రం ఎక్సర్సైజ్ ద్వారా తిన్నదంతా కరిగించేస్తాను అంటాడు.. సల్మాన్ ఖాన్ ఒక అద్భుతమైన వ్యక్తి.. అతడు అంటే నాకు చాలా ఇష్టం.. తనది మంచి మనసు.. సహాయం చేసే గుణం కూడా ఉంది.. అతడి తండ్రి రచయిత సలీం ఖాన్ ప్రతిరోజు సల్మాన్ కి డబ్బులు ఇస్తారు..

- Advertisement -

కోట్లకు అధిపతి అయినా.. పాకెట్ మనీ ఆయన దగ్గరే..
రూ.100 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటూ కోట్లు ఘడించిన సల్మాన్ ఖాన్ ఇప్పటికీ కూడా తన ప్యాకెట్ మనీని తన తండ్రి దగ్గర నుంచే తీసుకుంటారు.. తన సంపాదించిన డబ్బు మొత్తం దానధర్మాలకే పోతుంది.. ముఖ్యంగా సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు వారికి దానంగా ఇచ్చేస్తాడు..

ప్యాకెట్ మనీ డబ్బు మొత్తం వారికే..
తన తండ్రి దగ్గర తీసుకున్న పాకెట్ మనీ కూడా తన ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చేస్తాడు.. అది రూ.50,000 అయినా ₹1,00,000 అయినా సరే తన తండ్రి తనకు పాకెట్ మనీ ఇచ్చారు అంటే దానిని పేదలకు దానం చేస్తాడు.. ఇప్పటికీ అలాంటి దానధర్మాలు ఎన్నో చేశాడు.. నెలకు దాదాపుగా రూ.30 లక్షల వరకు దానం చేస్తూ ఉంటాడు.. ఇక సల్మాన్ ఖాన్ గొప్పతనం గురించి చెప్పాలంటే మాటలు రావు అంటూ సల్మాన్ ఖాన్ మంచి మనసు గురించి గుర్తు చేశారు ప్రముఖ నటుడు విందు.

సల్మాన్ పై ఫ్యాన్స్ ప్రశంసలు..
ఇక ఈ విషయం తెలిసి సల్మాన్ ఖాన్ అభిమానులను సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు ఈయన మంచి భోజనం ప్రియులు అని.. తన ముందు ఏదైనా ఆహారం ఉంటే ఇష్టంగా తింటారు.. ఆ తర్వాత ఆ తిన్న ఆహారాన్ని కరిగించడానికి ఎక్సర్ సైజ్ చేస్తారని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు