Karthi: ఈ కాంబినేషన్ ముందు జరిగి ఉంటే బాగుండేది

తమిళ్ నటుడు కార్తీ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో మంచి హిట్ అయ్యాయి. కార్తీ కు కూడా తెలుగులో సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అనడం అతిశయోక్తి కాదు. సూర్య తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చిన కార్తీ తనకంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. కార్తీ కు కూడా పర్సనల్ గా తెలుగు ఆడియన్స్ అంటేనే తనకు చాలా ఇష్టమని చెబుతూ ఉంటాడు. కార్తీ ని చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు కార్తీ ఎప్పుడు పరభాష నటుడు అనిపించుకోడు ఎందుకంటే అంత చక్కగా తెలుగు మాట్లాడుతాడు.

ఇక రీసెంట్ గా కార్తి నటించిన జపాన్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది హీరోలకి కొన్ని నెంబర్స్ ఎందుకో వర్కౌట్ కావు అని చెప్పొచ్చు. ఎన్నో అంచనాల మధ్య కార్తీ కెరియర్లో 25వ సినిమాగా వచ్చిన జపాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే ఈ టీజర్, ట్రైలర్ మాత్రం సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ను పెంచాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ కి వెళ్ళిన ఆడియన్స్ కి కొద్దిపాటి నిరాశ మిగిలిందని చెప్పొచ్చు.

ఇక కార్తీ ప్రస్తుతం తన 26 వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. కార్తీ26 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. సూదు కవ్వుం (2013) మరియు కధలుమ్ కాదందు పోగుమ్ (2016) సినిమాల ఫేమ్‌ నలన్ కుమారసామి దర్శకత్వం వహిస్తున్నారు.సూదు కవ్వుం సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.

- Advertisement -

ఈ సినిమాలో కార్తీ సరసన కృతి శెట్టి హీరోయిన్ కనిపించనుంది. కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోహిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. అయితే ఆ సినిమా మంచి హిట్ అయి కృతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత కృతి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా స్కోర్ చేయలేదు. ఇక ఈ సినిమా కృతికి ఎంతలా వర్కౌట్ అవుతుందో తెలియాలి అంటే కొంతకాలం వెయిట్ చూడక తప్పదు.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పైన కార్తీ కి మంచి అంచనాలు ఉన్నాయి. కార్తీ నటిస్తున్న ఈ సినిమాలో కరుణాకరన్,ఆనంద్ రాజ్, సత్యరాజ్, రాజ్ కిరణ్ వంటి నటులు ప్రముఖ పాత్రలలో కనిపిస్తున్నారు. జార్జి సి విలియం ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత కార్తీ 96 సేమ్ ప్రేమ్ సి కుమార్ తో సినిమాను చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాతో పాటు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ సినిమాను చేయనున్నాడు. ఇక కార్తీ నటిస్తున్న ఈ 26వ సినిమా మంచి విజయం సాధిస్తుందని చాలామందికి అంచనాలు ఉన్నాయి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు