Vijay Antony: బిచ్చగాడు3 కి భారీగా ప్లాన్ చేస్తున్న విజయ్ ఆంటోని 

హీరోగా మారిన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన బిచ్చగాడు సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు కి సీక్వెల్ గా బిచ్చగాడు2 సినిమా ఇటీవల విడుదలైంది. తొలిరోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ మంచి ఓపెనింగ్స్ రాబట్టగలిగింది. ఈ సినిమా తమిళ్ లో 3కోట్ల గ్రాస్ వసూలు చేయగా, తెలుగు రాష్ట్రాల్లో 4కోట్ల గ్రాస్ తో తమిళ్ కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టి  అందరిని ఆశ్చర్య పరిచింది. తొలి ఆట నుండి మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న ఈ సినిమాకి మల్టీప్లక్స్ లో మినహాయిస్తే చాలా సింగిల్ స్క్రీన్స్ లో హౌస్ ఫుల్ పడటం విశేషం.

తోలి రోజు వచ్చిన మిశ్రమ స్పందనతో సంబంధం లేకుండా మంచి వసూళ్లు రాబడుతూ ప్రపంచవ్యాప్తంగా 7రోజుల్లో 28కోట్ల గ్రాస్ రాబట్టి హిట్ దిశగా సాగుతోంది.ఈ క్రమంలో బిచ్చగాడు సినిమాకి పార్ట్ 3కూడా ఉండనుందని అనౌన్స్ చేసాడు విజయ్ ఆంటోని. పార్ట్ 3 ని రెండు బాగాలకంటే భారీగా ప్లాన్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. బిచ్చగాడు2 కి తెలుగులో వచ్చిన మిశ్రమ స్పందనని దృష్టిలో పెట్టుకొని పార్ట్ 3కథ తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మరింత ఎంగేజింగ్ గా రూపొందించాలని భావిస్తున్నాడట.

బిచ్చగాడు 2సినిమా ప్రమోషన్ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో చేయలేదని  చెప్పాలి. బడ్జెట్ పరిమితులో మరే ఇతర కారణాలో తెలీదు కానీ, బిచ్చగాడు2 సినిమాకి  ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవటం వల్లే తెలుగులో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన రావటానికి కారణం అని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో పార్ట్ 3 విషయంలో ఈ పొరపాటు జరగకూడదని ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేయాలని విజయ్ ఆంటోని భావిస్తున్నాడట. పార్ట్ 2 హిట్ అయిన ఉత్సాహంలో ఉన్న విజయ్ ఆంటోని పార్ట్ 3ని ఏ రకంగా ప్లాన్ చేస్తాడో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు