Ahimsa: పోటీ పడుతున్న తమ్ముళ్లు – నెగ్గేదెవరు..?

రానా తమ్ముడు అభిరామ్ సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన అహింస సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. అభిరామ్ సరసన గీతికా తివారి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేక సతమతం అవుతున్న దర్శకుడు తేజకి ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. మరో పక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా ‘నేను స్టూడెంట్ సార్’ సినిమాతో అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గణేష్ మొదటి సినిమా స్వాతిముత్యంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో గణేష్ సరసన అవంతిక హీరోయిన్ గా నటించింది.

ఇటీవలే విడుదలైన ఈ రెండు సినిమాల ట్రైలర్లు సినిమాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ హాలిడే కావడం ఈ యువ హీరోలకు కలిసొచ్చే అంశం అని చెప్పాలి. రెండు సినిమాలు కమర్షిల్ ఎలిమెంట్స్ ని నమ్ముకోకుండా కథని నమ్ముకొని రూపొందించటం వల్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే హిట్ దిశగా పయనించటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే రానా తన విలక్షణ నటనతో అటు హీరోగా విలన్ గా అలరించటమే కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకత చాటుకున్న నేపథ్యంలో అభిరామ్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది. బెల్లంకొండ గణేష్ మొదటి సినిమా స్వాతిముత్యం పర్వాలేదనిపించినా, కమర్షియల్ గా హిట్ అయితే ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు హీరోల తమ్ముళ్లు ఒకే రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నేపథ్యంలో ఎవరు హిట్ అందుకుంటారు ఆసక్తి నెలకొంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు