Rebel Star: ప్రభాస్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేస్తున్న హను..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో స్ట్రాంగ్ లైనప్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, మారుతి డైరెక్షన్లో మరో సినిమాను లైన్లో పెట్టాడు ప్రభాస్. అంతే కాకుండా సీతారామం సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో మరో సినిమాకి కమిట్ అయ్యాడని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ సినిమాకు సంబందించిన కథ విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

దర్శకుడు హను ప్రభాస్ తో సినిమా కోసం సీతారామం తరహాలోనే వార్ బ్యాక్డ్రాప్ లో ఒక లవ్ స్టోరీని సిద్ధం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ కథలో లవ్ స్టోరీతో పాటు ఫ్రెండ్షిప్ ని హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సీతారామం సినిమా చూసి ఇంప్రెస్ అయిన ప్రభాస్ అలాంటి కథని సిద్ధం చేయమని కోరగా, హను ఈ కథని వినిపించాడని, అందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

వరుస యాక్షన్ సినిమాలతో నిండిన ప్రభాస్ లైనప్ లో ఈ లవ్ స్టోరీ రిఫ్రెషింగ్ ఫీల్ ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. లవ్ స్టోరీ ప్రధానంగా తెరకెక్కిన ప్రభాస్ గత చిత్రం రాధే శ్యామ్ నిరాశపరచడంతో ఫ్యాన్స్ ప్రభాస్ నుండి మరో లవ్ స్టోరీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, హను కాంబినేషన్లో రాబోయే సినిమా విషయంలో వస్తున్న వార్తలు గనక నిజమే అయితే ఈ సినిమా మరో క్రేజీ పాన్ ఇండియా సినిమా అయ్యే అవకాశం ఉంది. మరి, గాసిప్స్ తోనే హీట్ పెంచుతున్న ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చుతుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు