SSMB28: మహేష్ ఫ్యాన్స్ కి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ – ఎప్పుడంటే..? 

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన మహేష్ బాబు పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు మహేష్ కొంత గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ వెళ్లి ఈ మధ్యనే తిరిగొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఈ క్రమంలో మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటించనున్నట్టు తెలిపింది సినిమా యూనిట్.

అయితే, మే 31న గ్లింప్స్ విడుదలవుతుందని భావించిన మహేష్ అభిమానులకు ఈ అప్డేట్ ఒకరకంగా షాక్ కి గురి చేసిందనే చెప్పాలి. గత కొంత కాలంగా ఈ సినిమా టైటిల్ విషయంలో ‘అమరావతికి అటు, ఇటు’, ‘గుంటూరు కారం’, ‘ఊరికి మొనగాడు’ వంటి టైటిల్స్ ప్రచారంలో ఉండగా గుంటూరు కారం అనే టైటిల్ దాదాపు కన్ఫార్మ్ అయ్యిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ పై ఆసక్తి నెలకొంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా మహేష్ ఈ సినిమాలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో, డైలాగ్ మాడ్యులేషన్ తో కనిపించనున్నాడని వార్తలొచ్చిన నేపథ్యంలో అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి, ఆలా వైకుంఠపురంలో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో త్రివిక్రమ్ మహేష్ కి హిట్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు