Siddhu: మరో లేడి డైరెక్టర్ ని లైన్లో పెట్టిన సిద్ధు..!

హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినప్పటికీ ఆ మధ్య విడుదలైన డీజే టిల్లు సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకొని మంచి గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమాని ప్లాన్ చేస్తున్న సిద్దు తర్వాత ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారని వార్తలొచ్చాయి. ఇండస్ట్రీలో చాలా కాలంగా కాస్త్యుమ్ డిజైనర్ గా ఉంటున్న నీరజ కోన ఈ సినిమాతో తొలిసారి దర్శకత్వం వహించనున్నారు. నీరజ కోన వినిపించిన కథకి సిద్ధు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

ఇదిలా ఉండగా మరో లేడి డైరెక్టర్ నందిని రెడ్డితో కూడా సిద్దు ఓ సినిమా చేయనున్నాడని సమాచారం అందుతోంది. రచయత బీవీఎస్ రవి అందించిన కథను నందిని రెడ్డి డైరెక్ట్ చేయనున్నారని సమాచారం. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించబోయే ఈ సినిమాలో సిద్దు సరసన లేడి సూపర్ స్టార్ సమంత హీరోయిన్ గా నటించనుందట. ఇందుకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని సమాచారం.

సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో గతంలో ఓ బేబీ సినిమా రూపొంది డీసెంట్ హిట్ గా నిలిచింది. అయితే, ఇటీవల నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అన్నీ మంచి శకునములే సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేదు. ఈ నేపథ్యంలో నందిని రెడ్డి సిద్దుతో చేయబోయే సినిమా ఆమె కెరీర్ కి కీలకం కానుంది. మరి, డీజే టిల్లు హిట్ ఇచ్చిన ఎనర్జీతో ఉన్న సిద్దు రీసెంట్ గా డిజాస్టర్స్ అందుకున్న సమంత, నందిని రెడ్డిలకు హిట్ ఇస్తాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు