‘వెంకీ’యా మజాకా.. కేవలం సిటీ థియేటర్లతో సాలిడ్ వసూళ్లు..!

టాలీవుడ్ లో గత కొంత కాలంగా రీ రిలీజ్ ల ట్రెండ్ బాగా జరిగిందన్న సంగతి తెలిసిందే. ఇక ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా ద్వారా ఆ సినిమా కావాలి, ఈ సినిమా కావాలి అంటూ ఏ హీరో ఫ్యాన్స్ అయితే ఆ హీరో ఫ్యాన్స్.. తమకు కావాల్సిన సినిమాల రీ రిలీజ్ ల ట్రెండ్ చేస్తూ డిమాండ్ చేసేవాళ్ళు. అలాగే , మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్, కామెడీ కింగ్ బ్రహ్మీ ఫ్యాన్స్ కూడా తమకు వెంకీ సినిమా రీ రిలీజ్ కావాలని ట్రెండ్ చేసారు.

అనుకున్నట్టుగానే డిసెంబర్ 29 న వెంకీ మూవీ ని రీ రిలీజ్ చేశారు.. అయితే చూడ్డానికి సింపుల్ గా ఉండే వెంకీ సినిమా థియేటర్లో జనాలు చూస్తారని మేకర్స్ అస్సలు ఊహించలేదనుకుంటా? అందుకే కేవలం హైదరాబాద్ వంటి మా నగరాల్లో మాత్రమే రిలీజ్ చేసారు. కానీ చాలా లిమిటెడ్ థియేటర్లలో రిలీజ్ అయిన వెంకీ మూవీ న్యూ ఇయర్ అడ్వాంటేజ్ తో దుమ్ము లేపింది. ముఖ్యంగా బిసి సెంటర్లలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసారు. ఒక రకంగా మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కంటే బ్రహ్మీ కల్ట్ ఫ్యాన్స్ ఈ సినిమాకి ఎక్కువగా వచ్చారని చెప్పొచ్చు.

చాలా చోట్ల బ్రహ్మీ ఫ్యాన్స్ ఫ్లెక్సీ కూడా వేశారు. ఇక థియేటర్లో రవన్న ఎంట్రీ కంటే బ్రహ్మీ ఎంట్రీ కి విజిల్స్ పడడం చూసాం. ఇక వెంకీ సినిమా వసూళ్లు కూడా ఆశ్ఛర్య పోయే స్థాయిలో భారీ కలెక్షన్లు వచ్చాయని చెప్పొచ్చు. చాలా థియేటర్లలో రిలీజ్ అయిన వెంకీ కేవలం సిటీ ఏరియా లోనే నాలుగు రోజుల్లో 55 లక్షల వరకు గ్రాస్ వసూలు చేసిందట. ఇక ఇప్పటికి కొన్ని థియేటర్లలో ఆడుతున్న వెంకీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 1.80 కోట్ల నుండి 2 కోట్ల వరకు కలెక్షన్లు వసూలు చేయొచ్చని టాక్ నడుస్తుంది.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు