Raviteja: పండగ సినిమాల్లో లో బజ్ ఉంది ఈ సినిమాకే?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి 5 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలిసిందే. పైగా ఈ అయిదు సినిమాలు కూడా వేటికవే స్పెషల్ గా క్రేజ్ ని సంపాదించాయి. పైగా వీటితో పాటు మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అయితే తెలుగు సినిమాలు ఉండగా వీటికి థియేటర్లు కేటాయించడం అసాధ్యమనే చెప్పాలి. అయితే ఈ సంక్రాంతి కి రాబోయే సినిమాల్లో ప్రతి సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకునే సినిమాలే ఉండగా, వీటిలో అన్నిటికంటే తక్కువ బజ్ ఉన్న సినిమా ఎదో తెలుసా?

ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఆడియన్స్ ద్రుష్టిలో తక్కువ బజ్ ఉంది “ఈగల్” సినిమాకు. అవును.. ఇది నిజం.. చాలా మంది ఈ పండగ సినిమాల్లో తక్కువ హైప్ ఉన్న సినిమా ఏదంటే ‘నా సామి రంగ’ లేక ‘హనుమాన్’ సినిమా అంటారు. కానీ నా సామి రంగ ముందు నుండే మార్కెటింగ్ పరంగా మంచి క్రేజ్ ని సొంతం చేసుకోగా, రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ లో కొన్ని రోజులు ప్రమోషన్లు ఆపారు. కానీ రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ తో మంచి క్రేజ్ ని పొందగా, ఫ్యామిలి ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కట్టే ఛాన్స్ ఉంది.

ఇక హనుమాన్ సినిమా పండగ సినిమాల్లో స్టార్ బేస్ లేకుండా వస్తున్నా, మంచి డెవోషనల్ కంటెంట్ తో పాజిటివ్ హైప్ తో వస్తుంది. ఇక గుంటూరు కారం, సైన్ధవ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

- Advertisement -

ఇక చివరగా ఈగల్ సినిమా అనౌన్స్ చేసినపుడే పొంగల్ రిలీజ్ అని అన్నా కూడా ఈ సినిమా పై బజ్ అంతగా ఏర్పడలేదు. ట్రైలర్ చూసాక రవితేజ పాత సినిమాల కంటెంట్ లాగానే ఈ సినిమా కూడా అనిపించింది. పైగా ఈ సినిమా పాటలు కూడా ఏమాత్రం మెప్పించకపోగా, రవితేజ గత సినిమాల పరాభవం వల్ల కామన్ ఆడియన్స్ లో ఈ సినిమా పై అసలు ఏమాత్రం హైప్ కనిపించడం లేదు. పైగా ఈ సినిమా మార్కెటింగ్ కూడా మిగతా సినిమాలతో పోల్చితే తక్కువ. ఆ విషయంలో మేకర్స్ ఇప్పటికైనా మేల్కోకపోతే కష్టం. దీన్ని బట్టి ఈగల్ సినిమా కంటెంట్ రిజల్ట్ పైనే ఆధారపడి రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. మరి పండగ సినిమాలు రిలీజ్ అయ్యేలోపు ఏ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు