Love Life: ప్రేమలో పడగానే అమ్మాయిల్లో ఈ అలవాట్లు మారిపోతాయి

ప్రేమ అనేది ఒక వ్యక్తిని పూర్తిగా మారుస్తుంది అనే మాట మనం వింటూనే ఉంటాం. అయితే ఈ మార్పు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది చాలా ఎమోషనల్ అవుతారు. మరికొంతమందికి అకస్మాత్తుగా బ్యూటీ కాన్షియస్ పెరిగిపోతుంది. ఇంకొంతమంది నిర్లక్ష్యంగా మారితే, కొందరు మాత్రం బాగా డెవలప్ అవుతారు. ఇక ప్రత్యేకంగా అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే రిలేషన్షిప్ లో అడుగు పెట్టిన తర్వాత వాళ్లలో చాలా అలవాట్లు మారిపోతాయి. అయితే ప్రేమలో పడిన తర్వాత చాలామంది అమ్మాయిల్లో కనిపించే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిద్ర లేకపోవడం
మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. లవ్ లో పడిన అమ్మాయి, అబ్బాయికి నిద్ర కరవవుతుంది. అదే విధంగా రియల్ లైఫ్ లో కూడా జరుగుతూ ఉంటుంది. ఒకరితో ప్రేమలో పడిన తర్వాత చాలామంది అమ్మాయిలు రాత్రిపూట నిద్రపోవడమే మానేస్తారు. రాత్రంతా ఫోన్లో మాట్లాడడం, కబుర్లు చెప్పుకోవడం వంటి అలవాటు వల్ల ఈ పరిస్థితి వస్తుంది. కనీసం ఎప్పుడు తెల్లారిందో కూడా తెలియనంతగా అలా ఇష్టమైన అబ్బాయితో రాత్రంతా మాట్లాడుతుంటారు.

2. తన గురించి తాను గర్వపడడం
సాధారణంగానే ప్రతి అమ్మాయి తాను అందంగా ఉన్నాను అని భావిస్తుంది. అయితే ప్రేమలో పడిన తర్వాత ఆ ఫీలింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. దీని ఫలితం కారణంగా వాళ్ళు అద్దం ముందు ఎక్కువ సమయం గడిపేస్తూ ఉంటారు. అద్దంలో తమను తాము చూసి గర్వపడడం, నవ్వుకోవడం వంటివి చేస్తూ ఉంటారు.

- Advertisement -

3. మొబైల్ లో సీక్రెట్స్
ప్రేమలో పడక ముందు వరకూ మొబైల్ గురించి పెద్దగా పట్టించుకోని అమ్మాయిలు కూడా ఒక్కసారి ప్రేమలో పడగానే మొబైల్ లేనిదే బతకలేనట్టుగా ప్రవర్తిస్తారు. అలాగే తమ ఫోన్ ను ఎవరిని ముట్టుకోనివ్వరు. అంతేకాదు రిలేషన్షిప్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఏ అమ్మాయి అయినా తన మొబైల్ ఆన్ అవ్వాలంటే తనకు మాత్రమే తెలిసేలా లాక్ లేదా పాస్వర్డ్ సెట్ చేస్తుంది.

4. పాటలతో మైమరిచిపోవడం
ప్రేమలో పడిన తర్వాత ఏ రొమాంటిక్ స్టోరీనీ చూసినా, లవ్ సాంగ్ విన్నా వాళ్లకు వాళ్లే గుర్తుకొస్తూ ఉంటారు. అప్పటిదాకా లవ్ అనగానే ఏదో తప్పులా ఫీలైన అమ్మాయిలు కూడా లవ్ లో పడగానే ప్రతి లవ్ స్టోరీలో తమను తాము ఊహించుకుంటారు. ఎక్కువగా రొమాంటిక్ సాంగ్స్ వింటూ ఉంటారు.

5. స్టైల్ మారుతుంది
సాధారణంగా ప్రేమలో పడిన తర్వాత చాలామంది అమ్మాయిలు ఇంతకు ముందు కంటే ఇప్పుడు తమపై ఎక్కువ శ్రద్ధ చూపడం స్టార్ట్ చేస్తారు. అలాగే వాళ్ళ డ్రెస్ సెన్స్ మారుతుంది, నడక కూడా మారుతుంది. నిజంగా ప్రేమలో పడ్డాక కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.

6. వ్యక్తిత్వాన్ని మరిచిపోతారు
చాలామంది అమ్మాయిలు ప్రేమలో పడగానే తమ లుక్స్ గురించి సెన్సిటివ్ గా మారుతూనే, మరోవైపు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. వాళ్లకు తెలియకుండానే తమ సొంత ఆలోచనలు, అభిప్రాయాలను పక్కన పెట్టి ప్రియుడి అభిప్రాయాన్ని అగ్రీ చేస్తుంది. వాళ్ల ఆలోచనలకే విలువనిస్తుంది. అలాగే అతనికి తగ్గట్టుగా, నచ్చేటట్టుగా తనను తాను మార్చుకోవడం కూడా స్టార్ట్ చేస్తుంది. ఇవన్నమాట ప్రేమను పడ్డ అమ్మాయిల్లో కనిపించే కొన్ని ప్రత్యేకమైన మార్పులు. మరి మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇలాగే ప్రవర్తిస్తోందా?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు