Prabhas: కంటతడి పెట్టుకున్న ప్రభాస్.. కారణం..?

పాన్ ఇండియా సినీ పరిశ్రమకు రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత వరుస సినిమాలు చేశారు. అయితే అనుకున్నంత స్థాయిలో అవి సక్సెస్ కాలేదు. ముఖ్యంగా బాహుబలి రేంజ్ లో ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కూడా రాలేదు అనడంలో సందేహం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన తెరకెక్కించిన సాహో , రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలు పూర్తిగా బోల్తా పడ్డాయి. ఇక దీంతో ప్రభాస్ నుంచి సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే అని అందరూ అనుకున్నారు.

దీంతో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కేజిఎఫ్ సినిమాలతో కన్నడ పరిశ్రమను పాన్ ఇండియాకు పరిచయం చేసిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 1సీజ్ ఫైర్ అనే సినిమాను విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఊహించని రేంజ్ లో సక్సెస్ అవ్వడమే కాదు ప్రభాస్ కి భారీ విజయాన్ని అందించింది. ముఖ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు సక్సెస్ చూస్తామా అని అభిమానులే కాదు ప్రభాస్ కూడా ఎదురు చూశారు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ కి ఇంత మంచి సక్సెస్ రావడంతో ఆయన ఎమోషనల్ అవుతూ ఆనంద భాష్పాలను రాల్చినట్లు సమాచారం.

ప్రస్తుతం సలార్ డిసెంబర్ 22వ తేదీన గత ఏడాది విడుదలై ఇప్పుడు రూ.625 కోట్ల కలెక్షన్స్ కూడా దాటి పలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు ఇంత భారీ విజయాన్ని అందించిన అభిమానులకు ఆడియన్స్ కి ధన్యవాదాలు చెబుతూ ఇంస్టాగ్రామ్ లో తన సంతోషాన్ని షేర్ చేశారు ప్రభాస్.. ” నేను ఖాన్సార్ ఫేట్ డిసైడ్ చేసే లోగా మీరు న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. సలార్ ను ఓన్ చేసుకొని ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు డార్లింగ్స్ అందరికీ థాంక్స్ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ కి అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ రిప్లై ఇస్తున్నారు.

- Advertisement -

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించారు. తొలి రోజే రూ.178.7 కోట్లు కలెక్షన్స్ కాబట్టి రికార్డు సృష్టించింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు