Hbd Adivisesh: హీరో అడివి శేష్ గురించి తెలియని నిజాలివే..!!

టాలీవుడ్ కుర్ర హీరోలలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో అడివి శేష్ .. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి పాపులారిటీ అందుకున్నారు. తాను ఇప్పటివరకు నటించిన చిత్రాలలో దాదాపు ఎక్కువగా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న చిత్రాలే ఉన్నాయని చెప్పవచ్చు.. ఇప్పుడు కూడా సరికొత్త కథలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటారు అడివి శేష్. చేసింది తక్కువ సినిమాలేనైనా తన విలక్షణమైన నటనతో మంచి మార్కులే సంపాదించుకున్నారు. ఈ రోజున అడివి శేష్ బర్త్డే సందర్భంగా ఈ నటుడు గురించి తెలియని విషయాలను తెలుసుకుందాం.

అడివి శేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించడం జరిగింది. ఇప్పుడు ఏకంగా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా తానే స్వయంగా కథలు రాయడంతో పాటు దర్శకుడుగా కూడా వ్యవహరిస్తున్నారట.. ఒక్క మాటలో చెప్పాలి అంటే అడివి శేష్ కు సినిమాలంటే పిచ్చి.. అందుకే తాను అమెరికా జీవితాన్ని కూడా వదిలేసి మరి టాలీవుడ్ కి మకాం మార్చేయడం జరిగింది. అలా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో కష్టాలు పడి అన్ని రంగాలలో పట్టు సాధించారు అడివి శేష్.

1985 డిసెంబర్ 17వ తేదీన అడివి శేష్ జన్మించారు.. పుట్టింది ఇండియాలో అయినా .. పెరిగింది మొత్తం అమెరికాలోనే.. అక్కడే తన విద్యాభ్యాసాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. తన బంధువులు సైతం ఇండస్ట్రీలో ఉండడంతో సినిమాల పైన ఆసక్తి పెంచుకొని మరీ అమెరికా నుంచి ఇండియాకి వచ్చేసారు. అలా కొన్ని చిత్రాలకు ఆడిషన్స్ కి వెళ్ళగా చాలామంది ఈ నటుడిని తిరస్కరించారట. అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా సొంతం సినిమాతో వెండితెర పైన కనిపించారు.

- Advertisement -

ఇందులో చిన్న పాత్రలో నటించినప్పటికీ పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాతో తన గుర్తింపును అందుకున్నారు.. ఆ తర్వాత రన్ రాజా రన్, బలుపు తదితర చిత్రాలలో మంచి పాత్రలలో పోషించడం జరిగింది. ఇక బాహుబలి సినిమాలో ఏకంగా బల్లాలదేవుడు కుమారుడిగా కనిపించి మరింత క్రేజ్ అందుకున్నారు. అలా అడివి శేష్ నటించిన ఎన్నో చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి..

అడివి శేష్ కు గుర్తింపు సంపాదించిన సినిమాలలో క్షణం, గూడచారి, ఎవరు ,మేజర్, హిట్ -2 వంటి చిత్రాలు.. అడివి శేష్ అసలు పేరు అడివి శేష్ సన్నీ చంద్ర.. అడివి శేష్ కు ఎక్కువగా తన కుటుంబంతో గడపడం చాలా ఇష్టమట.. నటనలోనే కాకుండా రచయితగా, డైరెక్టర్ గా కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా అడివి శేష్ పర్యావరణ పరిరక్షణ కోసం చాలా పోరాడుతూనే ఉంటారు. అందుకోసం ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పలు రకాల కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ఎక్కువగా జంతువుల నుంచి తయారుచేసిన వస్తువులను, దుస్తులను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు