Bigg Boss 7: బిగ్ బాస్ వల్ల తేజ కి మాత్రమే లాభమా.. లక్కీ ఛాన్స్ కొట్టాడుగా.!

బుల్లితెరపై వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటివరకు ఆరు సీజన్ లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ కూడా మొదలుపెట్టింది. ఇక నేటితో ఈ సీజన్ కూడా పూర్తీ కాబోతోంది. సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు సినిమాల ద్వారా సీరియల్స్ ద్వారా పాపులారిటీ దక్కించుకోకపోయినా ఒక్కసారిగా బిగ్ బాస్ లోకి వస్తే మాత్రం కచ్చితంగా వారు ఊహించని పాపులారిటీ లభిస్తుంది అనడంలో సందేహం లేదు. అంతే కాదు ఇప్పుడు కామన్ మ్యాన్ క్యాటగిరి కింద ఆరవ సీజన్లో ఆదిరెడ్డి.. ఏడవ సీజన్లో పల్లవి ప్రశాంత్ లు కూడా వచ్చి భారీ క్రేజ్ దక్కించుకున్నారు.

ఇకపోతే సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన వారికి పాపులారిటీ భారీగా లభిస్తుంది. కానీ అవకాశాలు మాత్రం లభించవనే చెప్పాలి. ఇప్పటికే చాలామంది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి భారీగా పాపులారిటీ దక్కించుకున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు బిగ్ బాస్ లో టైటిల్ విన్నర్ సాధించిన తర్వాత కూడా అవకాశాలు రావడం లేదు అంటే ఇక వారికి బిగ్ బాస్ ఏమాత్రం ఉపయోగపడడం లేదు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఊహించని విషయం ఏమిటంటే బిగ్ బాస్ ఏడవ సీజన్లో హౌస్ లోకి వచ్చి 9వ వారం ఎలిమినేట్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచిన టేస్టీ తేజకు ఊహించిన విధంగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

ఏకంగా టేస్టీ తేజకు 15 సినిమాలలో అవకాశాలు రావడం ఆశ్చర్యకరం. వాస్తవానికి గతంలో బిగ్ బాస్ వెళ్లిన వాళ్లకి గానీ, విన్నర్స్ కి గానీ ఇలా అవకాశాలు రాలేవు. కొంత మంది అయితే ఏకంగా బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాతే తమ కెరీర్ నాశనం అయింది అని అన్నారు కూడా.. ఇక తెలుగులోనే కాదు.. బాలీవుడ్ లోనూ అదే పరిస్థితి.. రాఖీ సావంత్ కూడా బిగ్ బాస్ తర్వాత సినిమా ఛాన్స్ రావడం పూర్తిగా తగ్గాయని తెలిపారు. ఇలా ఎంతోమంది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి పాపులారిటీ దక్కించుకున్నారు కానీ అవకాశాలు పొందలేకపోయారు. కానీ టేస్టీ తేజ ఊహించని విధంగా సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడంతో.. బిగ్ బాస్ కేవలం టేస్టీ తేజకు మాత్రమే ఉపయోగపడిందా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హౌస్ లో ఉన్నంత సేపు తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టేస్టీ తేజ.. ఫుడ్ వ్లాగర్ గా సెలబ్రిటీలతో పలు వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇక సెలబ్రిటీలతో భారీ పరిచయాలు పెంచుకున్న టేస్టీ తేజ ఇక సినిమాలలోకి వస్తే ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు