Tollywood 2023: ఏడాది ఘోరమైన పరాభవాన్ని పొందిన హీరోలు వీళ్లే..!

మరికొన్ని రోజుల్లో 2023వ సంవత్సరం ముగియబోతోంది. ఇక ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఎన్నో సినిమాలు భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యాయి. అందులో చాలామంది హీరోలు తమ మార్కెట్ ను చూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే అందులో కొంతమంది హీరోలు గ్లోబల్ మార్కెట్ ను చేరుకుంటే.. మరి కొంత మంది అట్టర్ ఫ్లాప్ గా నిలిచారు. మరి ఈ ఏడాది తమ సినీ కెరియర్లో ఘోరమైన పరాభవాన్ని చవిచూసిన హీరోల గురించి ఇప్పుడు చూద్దాం.

చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ వంటి ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా తీసినా సరే చిరంజీవికి ఉన్న క్రేజ్ కారణంగా ఆ సినిమా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు .కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. అసలు ఇలాంటి సినిమానే లేదు అని అభిమానులు సైతం మర్చిపోయేలాగా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది. అలా ఈ సినిమాతో చిరంజీవి డిజాస్టర్ ను మూట కట్టుకున్నారు.

అఖిల్ అక్కినేని: ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు.అలా అఖిల్ కెరీర్ లో ఈ ఏడాది భారీ డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచింది.

- Advertisement -

నిఖిల్: కార్తికేయ 2 చిత్రం తర్వాత నిఖిల్ నటించిన చిత్రం స్పై.. నిఖిల్ సినిమా అంటేనే కొత్తగా ఉంటుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తారు.. కానీ అలాంటి కొత్తదనం ఏమీ ఈ సినిమాలో కనిపించలేదు.. సుభాష్ చంద్రబోస్ గురించి కథ అనడంతో అందరూ ఆసక్తి చూపించారు కానీ రొటీన్ ట్విస్ట్ ల కారణంగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో నిఖిల్ కూడా ఈసారి ఫ్లాప్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు.

వైష్ణవ్ తేజ్: ఉప్పెన సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఇక ఏడాది ఆదికేశవ సినిమాతో సక్సెస్ అందుకోవాలనుకున్న ఈయనకు ఈ సినిమా కూడా నిరాశను మిగిల్చిందని చెప్పవచ్చు.

వీరే కాకుండా గాండీవదారి అర్జున సినిమాతో వరుణ్ తేజ్ .. స్కంద సినిమాతో రామ్ పోతినేని ఇలా చాలామంది హీరోలు ఈ ఏడాది తమ ఖాతాలో ఘోరమైన డిజాస్టర్ లను వేసుకున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు