Tollywood: టాలీవుడ్ హీరోలు… సుఖపురుషులు !

టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి ఎదుగుతున్న తరుణంలో స్టార్ హీరోల పైత్యం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. చుట్టూ భజనపరులు చేరటం వల్లనో, హిట్స్ తో వచ్చిన క్రేజ్ తలకెక్కటం వల్లనో కానీ, మధ్యాహ్నం ఒంటి గంట వరకు షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టడం లేదంట. వేసవి కావటంతో ఒంటిగంటకు వచ్చిన హీరోలు ఒకటి, రెండు షాట్స్ పూర్తవ్వగానే ఎండను సాకుగా చూపి క్యారవాన్ లో తిష్ట వేస్తున్నారట. సినిమా బడ్జెట్ లో సింహ భాగం రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోల ఈ నిర్లక్ష్య ధోరణి నిర్మాతలకు తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు ఎండ తీవ్రత కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి వెకేషన్ కి వెళ్లాడని వార్తలొచ్చిన సమయంలో ఒక వర్గం అభిమానులు టార్గెట్ చేసి ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. టాలీవుడ్ లో ఒక్క హీరో మాత్రమే కాదు.. స్టార్ హీరోలందరి వరస ఇలాగే ఉందని టాక్ వినిపిస్తోంది.
చిరంజీవి బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు అప్పట్లో రెండు షిఫ్ట్ లలో పని చేస్తూ, ఒకే సమయంలో రెండు, మూడు సినిమాలు చేసిన రోజులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఏ స్టార్ హీరో నుండి కూడా ఏడాదికి ఒక్క సినిమా మించి రిలీజ్ అవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ కి ఆలస్యంగా రావటం వల్ల బడ్జెట్ అంచనాలు తప్పి నిర్మాతలకు కోలుకోలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితి నెలకొనడానికి కారణాలు ఆలోచిస్తే, ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ల వైఖరే ప్రధాన కారణంగా అనిపిస్తోంది. ఈ రోజుల్లో డైరెక్టర్లు స్టార్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ కోసం తమ స్థాయి మరచి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేసే అభిమాని స్థాయికి దిగజారి భజన చేస్తున్నారు.
డైరెక్టర్లు చేసే భజనతో కళ్లు మూసుకుపోయిన హీరోలు తమకి తామే తోపులమని ఫీల్ అయ్యి, తాము చెప్పిందే వేదం అన్న తరహాలో వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే విశ్వనాధ్, దాసరి నారాయణరావు లాంటి లెజెండరీ డైరెక్టర్స్ లేని లోటు కనిపిస్తుంది. అప్పట్లో ఇమేజ్ కి సంబంధం లేకుండా స్టార్ హీరోల నుండి నటనను రాబట్టుకున్నారు ఈ ఇద్దరు డైరెక్టర్లు. ఇప్పుడు పరిస్థితి చుస్తే, అందుకు పూర్తి భిన్నంగా తయారయ్యింది, ముందు హీరోని డిసైడ్ అయ్యాక ఆ హీరో ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని నాలుగు ఎలివేషన్ షాట్స్, కథకు సంబంధం లేని ఆరు పాటలతో సినిమాని చుట్టేసి, వీల్ లెవెల్లో ప్రమోట్ చేసి సినిమా బ్లాక్ బస్టర్ అని స్వయంగా ప్రకటించుకొని బతికేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యి వారం గడిచాక అందులో ఒక్క సీన్ కూడా గుర్తుంచుకోలేని విధంగా తయారయ్యింది పరిస్థితి.
మన హీరోల తీరు ఇలాగే కొనసాగితే గనక టాలీవుడ్ కి కూడా ఇప్పుడు బాలీవుడ్ కి పట్టిన గతి పట్టే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పచ్చు. అసలే పది శాతం కూడా సక్సెస్ రేట్ లేని ఇండస్ట్రీ హీరోల నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇటీవల వచ్చిన ప్రపంచ స్థాయి గుర్తింపు మూన్నాళ్ల ముచ్చటగా మారే ప్రమాదం ఉంది. ఆరు పదులు దాటిన వయసులో కూడా చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు యంగ్ హీరోస్ తో పోటీ పడి సినిమాలు చేస్తుంటే బడా హీరోలు ఇలా ప్రవర్తించటం టాలీవుడ్ బ్రాండ్ ని డ్యామేజ్ చేస్తుందని గుర్తించాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు