Global Star: వి – మెగా పిక్చర్స్ నుండి ‘పవర్’ ఫుల్ సినిమా..!

యువీ ప్రొడక్షన్స్ విక్కీతో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వి మెగా పిక్చర్స్ బ్యానర్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ పై యూత్ కి అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. వి మెగా పిక్చర్స్ పై నిఖిల్ హీరోగా ‘ది ఇండియా హౌస్’ సినిమా అనౌన్స్ చేసారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ గ్లిమ్ప్స్ ఇటీవలే విడుదలై సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమాతో పాటు అఖిల్ తో కూడా ఒక సినిమా చేయనున్నారని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో మరో వి మెగా పిక్చర్స్ బ్యానర్ పై మరో పవర్ ఫుల్ సినిమా రానుందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వి మెగా పిక్చర్స్ పై సినిమా రూపొందనుందని, ఇందుకోసం ఒక రీమేక్ సబ్జెక్ట్ కూడా రెడీగా ఉందని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే పట్టాలెక్కే అవకాశం కనిపించలేదు. ప్రస్తుతం నిఖిల్ తో చేస్తున్న చరణ్, ఆ తర్వాత అఖిల్, శ్రీవిష్ణులతో సినిమాలు కమిట్ అయ్యాడట. ఈ సినిమాలకు సంబందించిన అనౌన్స్మెంట్ తావరలోనే రానుందని సమాచారం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ ఎలక్షన్ హడావిడిలో పడిపోతాడు కాబట్టి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు బిజీగా ఉండే ఛాన్స్ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లాలంటే ఏడాదికి పైగానే సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఆ మధ్య పవన్ కళ్యాణ్ నిర్మాతగా చరణ్ హీరోగా ఒక సినిమా రానుందని టాక్ వినిపించింది. ఒక సందర్భంలో రామ్ చరణ్ కూడా కొణిదెల ప్రొడక్షన్స్ లో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని అనౌన్స్ చేసాడు కానీ, ఆ కాంబినేషన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు రామ్ చరణ్ బ్యానర్ పై పవన్ సినిమా అన్న వార్తలు వస్తుండటంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు