Mem Famous: సత్తా చాటుతున్న ‘హీరో కమ్ డైరెక్టర్స్’.. !

స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన వారిని చాలా అరుదుగా చూస్తుంటాం.అలా హీరో కమ్ డైరెక్టర్ గా సక్సెస్ సాధించాలంటే ఎంతో ట్యాలెంట్ ఉండాలి. ఇటీవల కాలంలో హీరో కమ్ డైరెక్టర్లుగా సక్సెస్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. కాంతారా సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. చిన్న సినిమాగా విడుదలైన కాంతారా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరో యువ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే సినిమాలో హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి అటు దర్శకుడిగా, ఇటు హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు.
ఇక టాలీవుడ్ విషయానికి వస్తే, షార్ట్ ఫిలిం స్థాయి నుండి ఫీచర్ ఫిలిం వాకు ఎదిగిన హీరో కమ్ డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన మేం ఫెమస్ సినిమా ఇటీవలే విడుదలై డీసెంట్ కలెక్షన్స్ తో హిట్ దిశగా అడుగులేస్తోంది. మొదటి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మౌత్ టాక్ సాయంతో మెల్లగా పుంజుకుంటోంది.
సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలు కూడా రైటింగ్, డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో డైరెక్షన్ చేయలేదు ఇప్పటివరకు. భవిష్యత్తులో ఈ హీరోలు కూడా మెగాఫోన్ పట్టుకుంటే టాలీవుడ్ కి మరిన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ లాంటి కొద్దిమంది స్టార్ హీరోలకే సాధ్యమైన ఈ ఫీట్ ఇప్పుడు యంగ్ హీరోలు కూడా అందుకోవటం సినీ రంగానికి శుభపరిణామం అని చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు