Tollywood: టాలీవుడ్ సినిమాలకు దిష్టి తగిలిందా? ఈ పాన్ ఇండియా సినిమాల రిలీజ్ పై డౌట్స్!

Tollywood: ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ నెంబర్ వన్ ఇండస్ట్రీగా సత్తా చాటుతుందని సంబరపడిపోతుంటే, మరోవైపు 2024 లో రిలీజ్ కావాల్సిన పలు పాన్ ఇండియా సినిమాలు పోస్ట్ పోన్ కాబోతున్నాయి అనే వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురు చూస్తున్న దేవర, కల్కి, పుష్ప 2 వంటి భారీ బడ్జెట్ సినిమాలు వాయిదా పడబోతున్నాయి అనే వార్తలు టాలీవుడ్ ను ఆందోళనలో పడేస్తున్నాయి.

2024లో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న “దేవర” సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలోకి రాబోతోందని ప్రకటించారు. ఇక ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “కల్కి” సినిమాతో మే 9న ప్రేక్షకులను పలకరించబోతున్నారని, ఆ తర్వాత అదే జోరుతో ఆగస్టు 15న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నామని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూడు పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడబోతున్నాయనే ప్రచారం గట్టిగా జరుగుతోంది.

ఇప్పుడు పేర్కొన్న ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్‌తో వస్తున్న పాన్ ఇండియా సినిమాలు. కాగా, ఈ సినిమాల చిత్రీకరణ, పెండింగ్ పనుల కారణంగా వాయిదా పడబోతున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ రూమర్స్ ప్రకారం ఈ మూడు సినిమాల రిలీజ్ డేట్ ల విషయంలో నిజంగానే మార్పులు ఉంటే అవి ఇతర సినిమాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. గత సంవత్సరం “సలార్” టీం లాగా చివరి నిమిషం వరకు సైలెంట్ గా ఉండి, సడన్ గా తమ సినిమాను నెక్స్ట్ డేటుకు వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించి, ఇతర చిత్రాలపై భారం మోపకుండా వీలైనంత త్వరగా తమ సినిమాల రిలీజ్ డేట్ లను ప్రకటిస్తే బాగుంటుందనేది సినీ విశ్లేషకులు అభిప్రాయం.

- Advertisement -

అయితే “పుష్ప 2” టీం మాత్రం తాము అనుకున్న సమయానికే సినిమాను రిలీజ్ చేస్తామని గట్టిగా చెబుతున్నారు. ఇక ఈ మూడు సినిమాల సంగతి పక్కన పెడితే మరో రెండు మోస్ట్ అవైటెడ్ మూవీస్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజి” రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించనేలేదు. ఇక రాంచరణ్ “గేమ్ ఛేంజర్” సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో డైరెక్టర్ శంకర్ కే తెలియాలి. చివరగా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా రిలీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా మూడేళ్లు వెయిట్ చేయక తప్పదు. ఈ పరిణామాలన్నీ చూశాక కచ్చితంగా టాలీవుడ్ సినిమాలకు దిష్టి తగిలిందని అంటున్నారు నెటిజెన్లు. మరి ఈ ఐదు సినిమాల్లో ఎన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయి? ఎన్ని సినిమాలు అనుకున్న తేదీకి విడుదల అవుతాయో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు