Raja Saab: రిలీజ్ డేట్ పై “సలార్” సెంటిమెంట్… క్రిస్మస్ కే “రాజా సాబ్” రాక

Raja Saab : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా “రాజా సాబ్” రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ “సలార్” సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారా? “సలార్” వచ్చిన క్రిస్మస్ టైంలోనే “రాజా సాబ్” సినిమాను రిలీజ్ చేయబోతున్నారా? అంటే అవును అనే సమాధానం వస్తుంది ఇండస్ట్రీ నుంచి.

డార్లింగ్ ఫాన్స్ కు “సలార్”తో మొదలైన గుడ్ టైం అలాగే కంటిన్యూ అవుతోంది. రీసెంట్ గా “సలార్” మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇంకా అదే మేనియాలో ఉన్న ప్రభాస్ ఫాన్స్ కు రోజుకో గుడ్ న్యూస్ అందుతుంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా ఆయన లేటెస్ట్ మూవీ “రాజా సాబ్” మూవీ టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసి మంచి ట్రీట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై కూడా ఫిలిం వర్గాల నుంచి వస్తున్న లీకులు ప్రభాస్ అభిమానులలో మరింతగా జోష్ పెంచేస్తున్నాయి.

మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న “రాజా సాబ్” మూవీలో ప్రభాస్ సరసన తమిళ హీరోయిన్ మాళవిక మోహనన్ నటిస్తోంది. రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్లో రాబోతున్న ఈ సినిమాతో తమిళ కమెడియన్ యోగి బాబు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఓ గ్రామీణ యువకుడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు.

- Advertisement -

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ “రాజా సాబ్”లో ప్రభాస్ పూర్తిగా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటిదాకా వరుసగా భారీ బడ్జెట్, యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఈ సినిమాలో మాత్రం వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 50% షూటింగును పూర్తి చేసుకున్న “రాజా సాబ్” సినిమా డిసెంబర్లో రిలీజ్ కాబోతోందని సమాచారం.

ఇక ప్రభాస్ చాలా రోజుల తర్వాత “సలార్” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2023 డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా రిలీజై హిట్ కావడంతో ప్రభాస్ కు కలిసి వచ్చిన పండగ అనే సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని “రాజా సాబ్” మూవీని కూడా 2024 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ముందుగా “రాజా సాబ్” సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫిలిం వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మేకర్స్ దృష్టి అంతా క్రిస్మస్ పీరియడ్ పైనే ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ సినిమాను 2024 డిసెంబర్ 20న రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు