Koratala Siva : ఒక్క సినిమాను కూడా పోస్ట్ పోన్ చేయకుండా రిలీజ్ చేయలేడా ఈ డైరెక్టర్?

Koratala Siva : డైరెక్టర్ కొరటాల శివ అనగానే మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తొస్తాయి. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు తమ కెరీర్ లో గుర్తుండిపోయే ఇండస్ట్రీ హిట్ సినిమాలను ఇచ్చాడు ఈ దర్శకుడు. కానీ కొరటాల సినిమా అంటే అనుకున్న టైంకి మాత్రం రాదు అనేది గ్యారెంటీ. తాజాగా కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న “దేవర” సినిమా పోస్ట్ పోన్ ను మొదలుకొని ఆయన ఫస్ట్ మూవీ “మిర్చి” దాకా ఒక్క సినిమా కూడా వాయిదా పడకుండా రిలీజ్ కాలేదు. ఒక్కసారి కొరటాల శివ గత సినిమాల రిలీజ్ డేట్ల విషయంపై లుక్కేస్తే…

1. మిర్చి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన యాక్షన్ ఎంటర్టైనర్ “మిర్చి”. ఈ మూవీలో ప్రభాస్ సరసన అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా, కొరటాల ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇక 2013 ఫిబ్రవరి 8న రిలీజ్ అయిన మిర్చి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తన సినిమా కెరీర్ లోనే ప్రభాస్ అత్యంత స్టైలిష్ గా కనిపించిన ఈ సినిమాను ముందుగా ఫిబ్రవరి 7న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఫిబ్రవరి 8 కి పోస్ట్ పోన్ చేశారు.

2. శ్రీమంతుడు
సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ శ్రీమంతుడు. కొరటాల దర్శకత్వంలో రూపొందిన రెండవ సినిమా ఇదే. అయినప్పటికీ 2017 ఆగస్టు 7న రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది అంటే 40 నుంచి 70 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన శ్రీమంతుడు మూవీ 140 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను ముందుగా జూలై 17న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ జూలై 10న “బాహుబలి” సినిమా రిలీజ్ ఉండడంతో, వారం రోజుల గ్యాప్ ఉన్నప్పటికీ, శ్రీమంతుడు మూవీని సోలోగా రిలీజ్ చేయడం మంచిదని భావించి ఆగస్టు 7న థియేటర్లలోకి తీసుకొచ్చారు.

- Advertisement -

3. జనతా గ్యారేజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ “జనతా గ్యారేజ్”. ఈ సినిమాను ముందుగా 2016 ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తర్వాత జనతా గ్యారేజ్ మూవీ రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించి, 2016 సెప్టెంబర్ 1న థియేటర్లలోకి తీసుకొచ్చారు.

4. భరత్ అనే నేను
డైరెక్టర్ కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా “భరత్ అనే నేను”. ఈ మూవీని ముందుగా ఈ మూవీని 2018 సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయాలని భావించారు. కానీ అనుకున్న సమయానికి సినిమా పూర్తి కాకపోవడంతో 2018 ఏప్రిల్ 27న రిలీజ్ చేశారు.

5. ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ “ఆచార్య”. భారీ అంచనాలతో 2022 ఏప్రిల్ 29న రిలీజ్ అయిన ఈ సినిమాతో ఊహించని డిజాస్టర్ ను మెగా హీరోలకు ఇచ్చారు కొరటాల. ఇక ముందుగా ఈ మూవీని ఏప్రిల్ 1న రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత 29కి ఆచార్య రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు.

6. దేవర
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న రెండవ మూవీ దేవర. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావడంతో ముందుగా ప్రకటించిన విధంగా ఏప్రిల్ 5న రిలీజ్ కాకపోవచ్చు అని ప్రచారం జరుగుతుంది. ఇలా ఆయన ఫస్ట్ మూవీ నుంచి తాజా మూవీ వరకు ఈ డైరెక్టర్ ఒక్క మూవీని కూడా పోస్ట్ పోన్ చేయకుండా రిలీజ్ చేయలేకపోవడం గమనార్హం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు