Tollywood: వంద కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న స్టార్స్ వీళ్ళే!

Tollywood:

ఇండియన్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అదరగొడుతున్నాయి. ఖండాంతరాలు దాటి భారత దేశపు సినిమాలు భాషా భేదం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఆడేస్తున్నాయి. అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా.. ఇలా ఏ దేశంలోనైనా ఇండియన్ సినిమాలు మంచి ప్రశంసలందుకోవడంతో పాటు కలెక్షన్లు కూడా కొల్లగొడుతున్నాయి.

ఒకప్పుడు వంద కోట్ల క్లబ్ లో చేరడానికి స్టార్ హీరోలు తంటాలు పడిన రోజుల నుండి, ఇప్పుడు ఒక్కరోజులోనే 100కోట్ల క్లబ్ లో చేరే స్థాయికి ఇండియన్ మూవీ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయని చెప్పొచ్చు.
అలా తాజాగా మరో బాలీవుడ్ మూవీ జవాన్ కూడా ఫస్ట్ డే నే వంద కోట్లు వసూలు చేసి దుమ్ములేపింది.

ఇలా ఫిల్మ్ ఇండియాలో వంద కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న స్టార్ హీరోలు చాలా తక్కువమంది ఉన్నారు. వారిలో ముందుగా..

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి2 చిత్రం ద్వారా ప్రభాస్ తొలి సారిగా ఫస్ట్ డే వందకోట్ల ఓపెనింగ్స్ అందుకోగా, ఫస్ట్ టైం వంద కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న సినిమా గా బాహుబలి2 నిలిచింది. ఆ తరువాత సాహో, ఆదిపురుష్ సినిమాలతో మళ్ళి వంద కోట్ల ఓపెనింగ్స్ అందుకున్నాడు ప్రభాస్.

ఇక ఆ తరువాత కన్నడ స్టార్ ‘యష్’ ‘కెజిఎఫ్2’ సినిమా ద్వారా వంద కోట్ల ఓపెనింగ్స్ అందుకున్నాడు.

తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈ ఇయర్ రెండు సినిమాలతో అనగా, ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల భారీ ఓపెనింగ్స్ అందుకునే తిరుగులేని హీరో గా నిలిచాడు.

ఇక చివరగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన సినిమా RRR ద్వారా టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ వంద కోట్ల ఓపెనింగ్స్ అందుకున్నారు. అయితే మల్టీ స్టారర్ కాబట్టి ఇద్దరికీ భాగం ఉంటుంది.

ఇక రాబోయే పాన్ ఇండియన్ సినిమాల్లో “ఓజి”, SSMB29, గేమ్ ఛేంజర్, పుష్ప2, దేవర, సలార్, కల్కి2898, ఇంకా లియో సినిమాలకు వంద కోట్ల ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు