Tollywood: అప్పుడే విడాకులకు అప్లై చేశారా సార్.?

Tollywood:

అతనో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు. కేవలం దర్శకుడు మాత్రమే కాదు నటుడు , రచయిత గా కూడా కొద్దిపాటి అనుభవం ఉంది. చేసినవే తక్కువ సినిమాలే అయినా, అవన్నీ కొంచెం బాగానే ఆడాయి. తన నుంచి వచ్చిన లాస్ట్ సినిమా బీభత్సమైన హిట్ అయింది. దర్శకుడిగా తనకంటూ ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది.

ఈ యువ దర్శకుడి ఇటీవల కాలంలోనే పెళ్లి అయింది. అంతా సజావుగా సాగుతుంది అనుకుంటుండగానే, ఒక వార్త ఫిలిం నగర్ సర్కిల్ లో చడిచప్పుడు లేకుండా మెల్లగా తిరుగుతుంది. ఇంతకు ఆ వార్త సారాంశం ఏంటి అంటే ఆ యువ దర్శకుడు పెళ్లి అయి ఆరు నెలలు కాకముందే విడాకులకు అప్లై చేసినట్లు తెలుస్తుంది.

ప్రతి ఒక్కరి జీవితాల్లో వ్యక్తిగత సమస్యలు అనేవి సాధారణం.
ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వాటిలో ఏది మిస్ మ్యాచ్ అయిన, జీవిత ప్రయాణం సాగించడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో కలిసి ఉండటం కంటే, విడిపోయి ఎవరి బ్రతుకుల్లో వాళ్ళు ఆనందాన్ని వెతుక్కోవడమే మంచిది.
ఇకపోతే ఈ దర్శకుడు ఇప్పుడు భారీ సినిమాను డీల్ చేస్తున్నాడు.
ఆ సినిమాతో మళ్ళీ హిట్ సాధించాలని కోరుకుందాం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు