Jawan: జక్కన్న భారీ ప్లాన్… ఒకేసారి రెండు సినిమాలు

Jawan:

ఏంటి రాజమౌళి రెండు సినిమాలు చేయడమేంటి?

అదీ ఒకేసారి? అనుకుంటున్నారా? అవును.! చదివింది నిజమే..

కానీ మీరనుకుంటున్నట్టు అది సినిమా డైరెక్ట్ చేయడం గురించి కాదు. అసలు విషయానికొస్తే..

- Advertisement -

టాలీవుడ్ లో ఈ వారం రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. రెండూ డిఫరెంట్ జోనర్ మూవీస్ కావడం విశేషం. ఇక అందులో కామెడీ జోనర్ లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఒకటి కాగా, మరొకటి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్. ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యి మంచి టాక్ ని తెచ్చుకోవడం తో పాటు కలెక్షన్ల లో కూడా వాటి వాటి రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తున్నాయి.

 

అయితే తాజాగా ఈ రెండు సినిమాలను దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసిస్తూ, ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ కి విషెస్ తెలియచేసాడు. ఆ ట్వీట్ లో రాజమౌళి “చాలా రోజుల తర్వాత వరుసగా రెండు సినిమాలు చూసాను” అని అన్నాడు. ‘miss శెట్టి mister పొలిశెట్టి‘ లో స్వీటీ అనుష్క అద్భుతంగా నటిస్తే, నవీన్ ఇంకా అద్భుతంగా నవ్వించాడు. డైరెక్టర్ మహేష్ బాబు కి అభినందనలు అన్నాడు.

అలాగే ‘జవాన్’ గురించి అదే ట్వీట్ లో మాట్లాడుతూ, అందరూ షారుఖ్ ని బాక్స్ ఆఫీస్ బాద్ షా అనేది ఇందుకే.. అంటూ అట్లీకి కంగ్రాట్స్ చెప్పాడు. ఈ సినిమాతో నార్త్ లో కూడా తాను సక్సెస్ అయ్యాడని చిత్ర యూనిట్ కి విష్ చేసాడు. ఇక ఈ ట్వీట్ వేసిన నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియా లో ట్రెండ్ అయిపొయింది. అయితే రాజమౌళి ఈ సినిమాలకి విష్ చేయడం వల్ల ఈ సినిమాల కలెక్షన్స్ గ్రోత్ కి మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

ఇక ఈ ట్వీట్ పై షారుఖ్ కూడా వెంటనే స్పందించి సినిమా చూసినందుకు రాజమౌళికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు