Anushka Shetty: Miss శెట్టి, Mr పొలిశెట్టి 1st డే కలెక్షన్స్.. ఇంపాక్ట్ గట్టిగా పడింది?

Anushka Shetty:

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరో, హీరోయిన్లుగా miss శెట్టి, mr పోలిశెట్టి అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. గత ఆరు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 7న రిలీజ్ అయింది. ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఎంత మంచి టాక్ వచ్చినా కూడా ఈ సినిమా ప్రమోషన్లు పెద్దగా ఆకట్టుకోకపోవడం వల్ల ఆ ప్రభావం ఓపెనింగ్స్ పై పడింది.

అయితే అన్ని చోట్ల మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో నైట్ షో లలో జోరు చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 50 లక్షల షేర్, సీడెడ్ 10లక్షలు, ఆంధ్ర 45లక్షలు మొత్తం కలిపి తెలుగు స్టేట్స్ లో 1.05కోట్ల షేర్ సాధించింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ కొల్లగొట్టింది. ప్రీమియర్స్ తో కలిపి 330k డాలర్స్ వసూలు చేసిన ఈ సినిమా ఫస్ట్ డే కోటిన్నర షేర్ సాధించడం విశేషం.

అయితే తెలుగు రాష్ట్రాల్లో జవాన్ క్రేజ్ వల్ల కలెక్షన్ల పై ఇంపాక్ట్ పడినా కూడా పర్వాలేదనిపించింది. మౌత్ టాక్ వల్ల రెండో రోజు వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇక మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకి 12.50కోట్ల బిజినెస్ జరగగా, ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ తీసేస్తే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 10కోట్ల వరకు రాబట్టాల్సిన అవసరం ఉంది. మరి వీకెండ్ లో ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు