Sankranthi Movies 2024 : ఒక్క సినిమా కూడా మ్యూజిక్ తో మ్యాజిక్ చేయలేకపోయాయి

సాధారణంగా ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే అంతకంటే ముందు ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసే పాటలపై అందరి దృష్టి ఉంటుంది. పాటల వల్ల సినిమాపై మంచి హైప్ పెరుగుతుంది. అందుకే సినిమా ప్రమోషన్లలో ముందుగా పాటలను విడుదల చేస్తూ ఉంటారు మేకర్స్. ఒకవేళ ఆ పాటల వల్ల బజ్ క్రియేట్ కాలేదు అంటే సినిమా హిట్ అవ్వడం అనేది సందేహమే. ముఖ్యంగా ప్రతి ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు మ్యూజిక్ తోనే మ్యాజిక్ చేస్తూ ఉంటాయి. కానీ ఈసారి సంక్రాంతికి మాత్రం అలా జరగలేదు. కనీసం ఒక్క సినిమాలో కూడా అదిరిపోయే లేదా వినసొంపైన పాటలు లేనేలేవు.

2024 సంక్రాంతి కానుకగా నలుగురు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. జనవరి 12న సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” విడుదలైంది. అదే రోజు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబోలో రూపొందిన సూపర్ హీరో మూవీ “హనుమాన్” కూడా థియేటర్లలోకి వచ్చింది. ఇక జనవరి 13న విక్టరీ వెంకటేష్, కెరీర్లో 75వ చిత్రంగా తెరకెక్కిన “సైంధవ్” మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. జనవరి 14న నాగార్జున హీరోగా నటించిన కలర్ ఫుల్ మూవీ “నా సామి రంగ” థియేటర్లలోకి రానుంది. ఈ మూవీతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా మారబోతున్నాడు. ఇందులో ఇప్పటికే రిలీజ్ అయిన “గుంటూరు కారం” మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది, “హనుమాన్” మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇక ఈరోజు విడుదలైన “సైంధవ్” మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. “నా సామి రంగ” మూవీ రిజల్ట్ ఏంటో తెలియాలంటే జనవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.

అయితే ఈ నాలుగు సినిమాల్లో కూడా పాటలు ఉన్నప్పటికీ ఒక్క మూవీ కూడా మ్యూజికల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. “గుంటూరు కారం” మూవీలో “కుర్చీ మడత పెట్టి”, “మామ ఎంతైనా కానీ” అనే సాంగ్స్ బాగున్నప్పటికీ ప్రేక్షకులు వాటిని ఓన్ చేసుకోలేకపోతున్నారు. దానికి కారణం “కుర్చీ మడత పెట్టి” సాంగ్ ను ఈ సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎన్ని సినిమాల నుంచి కాపీ కొట్టాడో నెటిజెన్లు ఆధారాలతో సహా బయటపెట్టారు. అలాగే ఎవరో ఒక ముసలాయన చెప్పిన డైలాగులు మహేష్ చేత పలికించడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. మహేష్ బాబు అభిమానులు మాత్రమే ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక “మామ ఎంతైనా కానీ” సాంగ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హనుమాన్, “సైంధవ్” సినిమాల్లో అసలు పాటలు ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. “నా సామి రంగ” మూవీలో మాత్రం ఒక రొమాంటిక్ సాంగ్ ను కొంతమంది ఇష్టపడుతున్నారు. ఇలా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు అన్ని సంక్రాంతికి సాంగ్స్ తో దుమ్మురేపకుండా చప్పగా రిలీజ్ అవుతుండడం విచిత్రంగా అనిపిస్తోంది.

- Advertisement -

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు