Genelia D’Souza: హీరో కొడుకు చేతిలో దారుణంగా మోసపోయిన స్టార్ హీరోయిన్ ?

తుంటరి పిల్ల జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉండే జెనీలియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బొమ్మరిల్లు సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా తెలుగునాట చేసిన అల్లరి గురించి ఎంత చెప్పినా తక్కువే. జెనీలియా బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అనేక భాషలలో ఎన్నో చిత్రాలను చేసింది. బాయ్స్ చిత్రం ద్వారా జెనీలియా తెలుగు తెరకు పరిచయమైంది.

2003వ సంవత్సరంలో సత్యం సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన జెనీలియా ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. ఇక బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్ ను 2013లో పెళ్లి చేసుకుని ముంబైలోనే సెటిల్ అయిపోయింది ఈ బ్యూటీ. అయితే తన సినిమా కెరియర్ స్టార్టింగ్ రోజుల్లో ఓ స్టార్ హీరో కొడుకుతో చాలా క్లోజ్ గా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ జెనీలియా ఆ హీరో కొడుకుని కొట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత జెనీలియాతో మిస్ బిహేవ్ చేసినట్లు… ఆమె ఫ్రెండ్ అంటూ సరదాగా ఉన్నా… అతడే తప్పుగా అర్థం చేసుకుని లిమిట్స్ క్రాస్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జెనీలియా తెలుగులో సినిమాల మానేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. కాగా ఇక 2006లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా కోసం ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు