Tamannaah Bhatia: మళ్లీ ఐటెం సాంగ్‌కు రెడీ… ఈ సారి బాబాయ్‌తో..!

మిల్క్ బ్యూటీ తమన్నా లస్ట్ స్టోరీస్ 2 తర్వాత ఒక్క సారిగా ఫామ్ లోకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కు ముందు మూవీ ఛాన్స్ లు ఎక్కువగా రాలేదు. కానీ, కెరీర్ స్టార్టింగ్ నుంచి తాను పెట్టుకున్న నో కిస్ పాలసీని బ్రేక్ చేసి, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ చేసిన తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం తమన్న తమిళంలో అరణ్మనై 4 చేస్తుంది. అలాగే బాలీవుడ్ లో వేదా మూవీ చేస్తుంది.

అయితే మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ నే ఐటెం సాంగ్స్ చేస్తూ తన ఫ్యాన్స్ ను స్వింగ్ చేస్తూంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో స్వింగ్ జర స్వింగ్ జర అంటూ యూత్ ని మొత్తం తనవైపునకు తిప్పుకుంది తమన్నా. అప్పట్టో ఈ సాంగ్ ఎలాంటి సంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీని తర్వాత తమన్నా మళ్లీ.. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కావాలయ్యా.. అంటూ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది. ఈ సాంగ్ జైలర్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు.

అయితే తమన్నా ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తో స్పెషల్ సాంగ్ లో కనిపించిన తమన్నా.. ఇప్పుడు నందమూరి నటసింహం బాలయ్యతో చిందేయ్యబోతుందని తెలుస్తుంది. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత బాలయ్య.. డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NBK109 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. దీనిలో డైరెక్టర్ బాబీ ఓ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. అందుకు మిల్క్ బ్యూటీ తమన్నాను మూవీ యూనిట్ సంప్రదించిందట. స్పెషల్ సాంగ్ ఆఫర్ కి తమన్నా కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు