Suriya Kanguva Movie Release Date : సూర్య కంగువ సినిమాకు రిలీజ్ డేట్ కష్టాలు… 2025కి పోస్ట్ పోన్ తప్పదా?

Suriya Kanguva Movie Release Date : ఈ ఏడాది రూపొందుతున్న కోలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో కంగువా కూడా ఒకటి. అయితే ఈ మూవీకి రిలీజ్ డేట్ దొరకట్లేదని, వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఇంతకీ కంగువా మూవీ రిలీజ్ డేట్ కష్టాలేంటి? అనే వివరాల్లోకి వెళితే….

కంగువా మూవీ రిలీజ్ డేట్ దొరకట్లేదా?

విజువల్ ఫీస్ట్ గా రాబోతున్న కంగువా మూవీలో సూర్య ఓ తెగకు చెందిన యోధుడిగా సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు. నిజానికి ఈ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ కంగువా రిలీజ్ డేట్ గురించి డైలమాలో పడ్డారట సూర్య అండ్ టీం. ఈ మూవీనీ రిలీజ్ చేయడానికి 2024లో సరైన డేట్ కనిపించట్లేదని, కాబట్టి 2025 ప్రధమార్ధంలో తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

అన్నీ పాన్ ఇండియా సినిమాలే

2024లో కల్కి 2898 ఏడి, పుష్ప 2, గేమ్ ఛేంజర్, కాంతారా 2, దేవర, ఇండియన్ 2 వంటి పెద్ద పెద్ద ఫ్యాన్ ఇండియా సినిమాలన్నీ వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. ఇది చాలదన్నట్టుగా బాలీవుడ్ లో సింగం 3, స్త్రీ2 వంటి సినిమాలతో పాటు మరికొన్ని హిందీ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి పెద్ద సినిమాలతో క్లాష్ అయ్యే కన్నా సోలోగా వస్తే మంచి బెనిఫిట్ ఉంటుందని భావిస్తోందట టీం. అందుకే 2024 ద్వితీయార్థంలో మూవీని రిలీజ్ సోలోగా చేయాలని ముందుగా అనుకున్నారట నిర్మాతలు. కానీ తీరా చూస్తే సెప్టెంబర్ మొదలుకొని డిసెంబర్ దాకా రిలీజ్ డేట్ లన్ని ఫిల్ అయిపోయాయి.

- Advertisement -

కంగువా వాయిదా తప్పదా?

జూన్ లో ఇండియన్ 2, లక్కీ భాస్కర్ జూలై లేదా ఆగష్టు ఫస్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఆగష్టు లో పుష్ప 2 ఫిక్స్. సెప్టెంబర్ 5న దళపతి విజయ్ ది గోట్ రాబోతోంది. సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి రిలీజ్ కాబోతోంది. రజినీకాంత్ వెట్టాయన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీతో క్లాష్ కు రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలు అక్టోబర్ 10ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశాయి. నాగ చైతన్య పాన్ ఇండియా మూవీ తండెల్ టార్గెట్ కూడా అక్టోబర్ నెల కావడం గమనార్హం. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతోందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. దీంతో అక్టోబర్ ఫుల్. ఇక కాంతారా 2 డిసెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నవంబర్ లో పలు బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కంగువా మూవీ 2025 కు వాయిదా పడుతుందని అంటున్నారు. మరి మేకర్స్ దీని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు