MAD: ఖచ్చితంగా ఈ కుర్రాడు సినిమాను కొన్ని రోజులు ఏలుతాడు

MAD:

హీరోలంటే కేవలం ఆరడుగుల ఎత్తు, దానికి సరిపడా బరువు, మంచి బాడీ ఉంటే మాత్రం సరిపోదు. కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ సమపాలలో ఉండటం కూడా ఒక హీరోకి గాని ఒక నటుడుకి గాని ఖచ్చితంగా చాలా అవసరం.

రీసెంట్ గా రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 6న అరడజనకు పైగా సినిమాలు రిలీజ్ అయితే, కేవలం మ్యాడ్ సినిమా మాత్రమే యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించింది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిది మంచి కీలక పాత్రే అయినా ఈ సినిమాలో మెప్పించింది మాత్రం సంగీత్ శోభన్.

ఈ సంగీత్ శోభన్ గురించి కొన్ని ఆసక్తికర వివరాలు ఇప్పుడు మనం చర్చిద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ కి వర్షం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను ఇచ్చిన శోభన్ యొక్క కుమారుడే ఈ సంగీత్ శోభన్. దర్శకుడు శోభన్ కి ఇద్దరు కుమారులు మొదట అబ్బాయి సంతోష్ శోభన్ రెండవ అబ్బాయి సంగీత్ శోభన్. సంతోష్ శోభన్ ఇదివరకే ఇండస్ట్రీలో “పేపర్ బాయ్” “అన్ని మంచి రోజులోచ్చాయి” వంటి సినిమాలతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు.

- Advertisement -

ఇకపోతే సంగీత్ శోభన్ జీలో ప్రసారమైన “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” సిరీస్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఓటీటిలో కొన్ని సిరీస్ లు చేశాడు.
మ్యాడ్ సినిమా విషయానికి కొస్తే సంగీత్ శోభన్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి. తన టైమింగ్ తో, తన డిక్షన్ తో, తన వాయిస్ మాడ్యులేషన్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఫ్యూచర్లో ఈ అబ్బాయి సినిమాను కొన్ని రోజులు ఏలుతాడు అనటంలో అతిశయోక్తి కాదు. “గోల్కొండ హై స్కూల్” సినిమాలో బొద్దుగా కనిపించిన ఈ ముద్దు ముద్దు పిల్లాడే ఈరోజు సన్నగా మారి తన టైమింగ్ తో ఆడియన్స్ కి చక్కిలిగింతలు పెట్టిస్తున్నాడు. మరో నవీన్ పోలిశెట్టి అయినా ఆశ్చర్యం లేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు