Tollywood: బట్టలు చించుకుంటారు లాంటి మాటలు నేను మాట్లాడకూడదు

Tollywood:

కొన్ని కాంబినేషన్ వింటేనే పూనకాలు ఆటోమేటిక్ గా వస్తాయి. అటువంటి వాటిలో బోయపాటి శ్రీను, బాలకృష్ణ. రాజమౌళి, ఎన్టీఆర్. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్. అలానే మహేష్ బాబు త్రివిక్రమ్ అంటూ చాలా చెప్పొచ్చు. ఇప్పటివరకు త్రివిక్రమ్ మాక్సిమం చేసిన సినిమాలన్నీ స్టార్ హీరోస్ తోనే చేసాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ,ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్ తో త్రివిక్రమ్ వర్క్ చేశాడు. మధ్యలో నితిన్ తో వర్క్ చేశాడు.

ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు అభిమానులకు కూడా బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఇందుకు గల కారణం ఇదివరకే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు అని చెప్పొచ్చు. ఆ సినిమాలు కమర్షియల్ గా థియేటర్లో హిట్ కాకపోయినా ఇప్పుడు చూస్తే మాత్రం అయ్యో ఇంత గొప్ప సినిమాలను కమర్షియల్ గా హిట్ లేకపోయామా అనే ఒక ఫీల్ లో ఉంటారు చాలామంది సినిమా అభిమానులు.

అందుకే ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుందనంటే చాలామంది ఆకలితో ఉన్నారు. ఎట్టకేలకు సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది గుంటూరు కారం. ఈ సినిమా విషయంపై అఫీషియల్ గా ఏ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రాకున్నా, కొన్నిసార్లు కొన్ని ఇంటర్వ్యూలలో నిర్మాత నాగ వంశీ చెబుతూనే వస్తుంటాడు. సినిమా ఎలా ఉండబోతుందో అని హింట్ ఇస్తూనే ఉంటాడు. రీసెంట్ గా జరిగిన మ్యాడ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చాలా ఇంటర్వ్యూలలో గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ప్రశ్నలు నాగవంశీకి ఎదురయ్యాయి.

- Advertisement -

వాటిని సమానంగా నాగ వంశీ బదిలీస్తూ చెప్పిన ఆన్సర్ కొన్ని ఇప్పుడు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. కేవలం పూనకాలు తెప్పించడమే కాకుండా సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు, శ్రీ లీల కాంబినేషన్లో రీసెంట్ గాని ఒక సాంగ్ షూట్ జరిగిందని, ఆ సాంగ్ మునిపెన్నడు మహేష్ బాబుని చూడని విధంగా ఉంటుందని తెలిపాడు. ఇంకా వంశీ మాటల్లో చెప్పాలి అంటే అరాచకం, బట్టలు చించుకుంటారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ మహేష్ బాబుని ఎప్పుడూ ఊహించని రీతిలో అభిమానులు మాత్రం చూస్తారు అని ఖచ్చితంగా చెప్పగలను అంటూ జవాబు ఇచ్చాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు