Ayalaan: రకుల్ కనిపించి రెండేళ్లయింది.. మళ్ళీ ఇన్నాళ్లకు?

Ayalaan:

గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ఫేమస్ అయ్యి చాలా తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ అయింది. ఒకానొక దశలో కొందరు స్టార్ హీరోల సినిమాలకి డేట్స్ అడ్జస్ట్ చేయనంత బిజీ అయిన ఈ భామ బాలీవుడ్ మోజులో పడి అందివచ్చిన అవకాశాలను చేజార్చుకుని ముంబైకి మకాం మార్చింది.

అయితే అక్కడ మొదట్లో వరుస అవకాశాలు వచ్చినా, అన్ని బి గ్రేడ్ సినిమాలే కావడం, అందులోనూ ఒక్కటి కూడా హిట్ కాకపోవడంతో ఆఫర్లు తగ్గిపోయాయి. సో మళ్ళీ సౌత్ ఇండస్ట్రీ నా ఇల్లు అంటూ సౌత్ బాట పట్టింది. తెలుగులో అయితే ఇప్పటివరకు మళ్ళీ అవకాశం రాలేదు. చివరగా రకుల్ 2021లో వచ్చిన “కొండపోలం” లో కనిపించింది. ఇక ఇప్పుడు తమిళ్ లో రెండు సినిమాల్లో నటిస్తుండగా, అందులో లేటెస్ట్ గా అయలాన్ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ కూడా దక్కించుకుంది.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అంటే రకుల్ ఫ్యాన్స్ కి తన సిల్వర్ స్క్రీన్ దర్శనం కావాడానికి రెండున్నర ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చిందన్నమాట. మరి దెబ్బ తిని సౌత్ కి వచ్చిన రకుల్ ఇప్పటికైనా సౌత్ ఇండస్ట్రీ వాల్యూ తెలుసుకొని వచ్చే అవకాశాలని అందిపుచ్చుకుంటుందా లేదా అనేది చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు