Rakul Preet: ఆ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు లీక్ చేసిన రకుల్..!

Rakul Preet

విభిన్న కథలతో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో కోలీవుడ్ డైరెక్టర్లు ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో తమిళంలో డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు వస్తున్నాయి. అవి తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా హిట్ అవుతున్నాయి.ఇప్పుడు మరో విభిన్నమైన కథతో తమిళంలో ఒక సినిమా వస్తుంది. అదే అయలాన్. ఏలియన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

రవి కుమార్ నుంచి ఇప్పటికే Indru Netru Naalai అనే ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మరింత డిఫరెంట్ గా ఏలియన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారు. అయలాన్ సౌత్ లోనే ఫస్ట్ ఏలియన్ బ్యాక్ డ్రాప్ మూవీ. దీని కోసం 4500ల‌కుపైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ వాడబోతున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే హ‌య్యెస్ట్ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్ష‌న్ సినిమా ఇదే. ప్ర‌ముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీ ఫాంట‌మ్ స్టూడియెస్ ఈ సినిమాకు గ్రాఫిక్స్ అందిస్తోన్న‌ట్లు పేర్కొన్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కోలీవుడ్ కి రీ ఎంట్రీ స్తున్న రకుల్ ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ సినిమాలో నటించడం మరచిపోలేని అనుభూతి అని, అయలాన్ లో భాగం కావడం గొప్ప అనుభవం అంటూ చెప్పింది.

- Advertisement -

అలాగే “సినిమాలో ఎదురుగా గ్రహాంతర వాసి ఉంది అన్నట్టు ఫీల్ అయి… నటించాలి. మన ఎదరుగా ఎవరూ ఉండరు. కానీ, మన ఎదురుగా గ్రహాంతర వాసి ఉంది అన్నట్టు ఆడియన్స్ ను నమ్మించాలి. అలా యాక్టింగ్ చేయాలి. ఇది పెద్ద సవాల్ తో కూడుకున్నది.” అంటూ అయలాన్ మూవీ షూటింగ్ విషయాలను చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు