Animal: రష్మిక మందన్నకి మంచి ఛాన్స్… కానీ..!

Animal

ఇండస్ట్రీకి అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నుంచి వచ్చే సినిమా అంటే మామూలు అంచనాలు ఉండవు. అలాగే ఆచి తూచి కథలను ఎంచుకుని, ఎలాగైనా హిట్ కొట్టే రణబీర్ కపూర్ హీరో చేస్తున్నాడు అన్నా… మంచి బజ్ ఉంటుంది. అలాంటి సినిమాలో వరుస ఫ్లాప్ లు అందుకుంటున్న రష్మిక మందన్న హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.ఆ సినిమానే యానిమల్. దీనిలో రష్మికకు ఛాన్స్ వచ్చిందని అనౌన్స్ మెంట్ వచ్చిన నాటి నుంచి ఒక్కటే చర్చ… బాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టార్లు అందుకున్న రష్మికకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా వచ్చిందని.

ఏది ఏమైనా, ఒక పెద్ద ప్రాజెక్ట్ లో రష్మిక మందన్నకు ఛాన్స్ రావడం మంచి విషయమే. కానీ, ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ను చూస్తే, కథకు హీరోయిన్ పాత్రకు పెద్దగా సంబంధం లేదని తెలుస్తుంది. సినిమా అన్న తర్వాత ఒక హీరోయిన్ ఉండాలి. హీరోతో ఆడిపాడాలి. రెండు సాంగ్స్.. మరో రెండు రొమాన్స్ సీన్స్ లో ఒక బ్యూటీ కనిపించాలి అనే విధంగానే యానిమల్ చిత్రంలో హీరోయిన్ పాత్ర ఉందని అర్థమవుతుంది.

ఈ టీజర్ రిలీజ్ కి ముందు రష్మిక మందన్న ఫస్ట్ లుక్ అంటూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో రష్మిక పాత్ర పేరు గీతాంజలి అని చెప్పారు. అలాగే చాలా ట్రెడీషనల్ లుక్ లో ఈ నేషనల్ క్రష్ ని చూపించారు. దీంతో యానిమల్ సినిమాలో రష్మిక పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని అప్పటి నుంచే వార్తలు స్టార్ట్ అయ్యాయి. తాజాగా టీజర్ తో రష్మిక పాత్ర గురించి ఒక క్లారిటీ వచ్చింది అంటున్నారు సినీ అభిమానులు.

- Advertisement -

అయితే మరి కొంత మంది దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. యానిమల్ సినిమాలో రష్మిక పాత్ర చాలా వైల్డ్ గా ఉండబోతుందని, కథను మలుపు తిప్పే క్యారెక్టర్ అని అంటున్నారు. కానీ, ఫస్ట్ లుక్ లో గానీ, టీజర్ లో గానీ, తర్వాత వచ్చే ఇతర అప్డేట్స్ లో గానీ, రష్మిక పాత్ర గురించి రివీల్ చేసే అవకాశం లేదని అంటున్నారు.

రష్మిక రోల్ గురించి డైరెక్టర్ సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలని అంటున్నారు. దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. కానీ, రష్మిక పాత్ర ఇలా ఉంటేనే ఆమె కెరీర్ కి కొంత మేర అయినా, ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా, నార్మల్ పాత్ర అయితే, ఇంత ప్రాజెక్ట్ లో నటించినా పెద్దగా ఉగయోగం ఉండదు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు