Bigg Boss Season 7: యావర్ నోరు తప్ప, బుర్ర వాడటం లేదు..!

Bigg Boss Season 7

మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకీ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ప్రీవియస్ సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్లో కంటెస్టెంట్స్ అందరు యాక్టివ్ గా ఉండటంతో షో ఫస్ట్ వీక్ నుండే ఆసక్తిగా మారింది. ప్రతి సీజన్లో లాగే ఈ సీజన్లో కూడా లవ్ ట్రాక్స్, సేఫ్ గేమర్స్, ఫేక్ ఫేసెస్ తో ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది.
ఎంటర్టైన్మెంట్, గ్లామర్ సమానంగా ఉండటంతో ఈ సీజన్ కి హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ వస్తోంది. ఇదిలా ఉండగా కంటెస్టెంట్స్ అందరూ తమ తమ గేమ్ ప్లాన్ ప్రకారం ఆడుతుంటే ప్రిన్స్ యావర్ మాత్రం బ్రెయిన్ వాడకుండా కేవలం అరుపులతో నెట్టుకొస్తున్నాడు. సీజన్ స్టార్టింగ్ లో చీటికీ మాటికీ షర్ట్ విప్పి బాడీ చూపిస్తూ షో ఆఫ్ చేసిన యావర్, ఆ తర్వాత అగ్రెసివ్ అవ్వటం స్టార్ట్ చేసాడు.
గురువారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో కూడా ఫుడ్ విషయంలో హౌస్ మేట్స్ అందరితో గొడవకు దిగాడు యావర్. అరవడమే పార్టీ సమస్యకి పరిష్కారం అని ఫీల్ అవుతున్నాడేమో అనిపిస్తుంది యావర్ బిహేవియర్ చూస్తుంటే. లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో తాను అగ్రెసివ్ గా ఉండటానికి కారణం అంటూ శివాజీ దగ్గర ఏడుస్తూ సింపతీ కోసం ట్రై చేసిన యావర్ ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాడు.
పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో కూడా యావర్ సొంతంగా ఆడకుండా శుభశ్రీ చెప్పినట్టు ఆడుతున్నాడు. అంతే కాకుండా యావర్ శివాజీ మాటలకు కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. కంటెస్టెంట్స్ అందరిలోకి వోటింగ్ పరంగా కాస్త వెనకబడి ఉన్న యావర్ ఈ వీక్ పవర్ అస్త్ర గెలుచుకొని ఎలిమినేషన్స్ నుండి సేవ్ అవుతాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు