Sunil In Kollywood: కోలీవుడ్లో సునీల్ కి పెరుగుతున్న డిమాండ్ – ఆ సినిమానే కారణమా..?

Sunil In Kollywood

సునీల్ ఈ మధ్య కామెడీ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా నెగిటివ్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. డిస్కోరాజా, కలర్ ఫోటో సినిమాలలో విలన్ రోల్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చిన సునీల్ పుష్ప సినిమాలో చేసిన రోల్ తో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు పొందాడు. ఇటీవల రిలీజైన జైలర్ సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ మంచ్చి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో సునీల్ కోసం కోలీవుడ్ డైరెక్టర్లు క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. సునీల్ కూడా క్యారెక్టరైజేషన్ పరంగా లిమిటేషన్స్ ఏమీ పెట్టుకోకపోవడం వల్ల తమిళ్ సినిమాల్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే, తెలుగులో కంటే కూడా ఎక్కువ తమిళ్ లో ఆఫర్లు వస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ప్రస్తుతం తమిళ్ లో విశాల్ హీరోగా నటిస్తున్న మార్క్ ఆంటోని సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాకుండా కార్తీ జపాన్ సినిమాతో పాటు లారెన్స్ తమ్ముడు హీరోగా పరిచయం అవుతున్న బుల్లెట్ సినిమాలో కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. వీటితో పాటు మరిన్ని క్రేజీ ఆఫర్లు సునీల్ వద్దకు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలన్నీ ఎలాగూ తెలుగులో డబ్ అవుతాయి కాబట్టి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు సునీల్ కి తెలుగులో కూడా కలిసొచ్చే అవకాశం ఉందన్న మాట.

టాలీవుడ్లో స్టార్ కమెడియన్ గా ఉన్న సమయంలో హీరోగా సినిమాలు చేసి వరుస డిజాస్టర్స్ ఎదుర్కొని కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వరుస ఛాన్సులు వస్తున్న నేపథ్యంలో సునీల్ మంచి క్యారెక్టర్స్ ఎంచుకుంటే కెరీర్ స్పాన్ పెరిగే అవకాశం ఉంది.  అయితే, సునీల్ కి తమిళ్ లో వరుస ఆఫర్లు రావటానికి కారణం పుష్ప సినిమాలో చేసిన విలన్ రోల్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి, సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాలు అందుకుంటున్న సునీల్ మునుపటిలా మళ్ళీ బిజీ అవుతాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు