Suhasini: ఆ హీరోయిన్ పై పగ.. పెళ్లి చెడగొట్టడానికి సర్వ ప్రయత్నాలు.. నిజమేనా..?

ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ సుహాసిని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలిన ఈమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అలా చాలామంది స్టార్ హీరోలతో జతకట్టిన ఈమె ఆరు పదుల వయసు దాటినా కూడా ఇంకా పడుచు పిల్లలా తన అందంతో యువతను ఆకట్టుకుంటుంది. ఇక సుహాసిని ఎవరో కాదు విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ చెల్లెలు.. అంతేకాదు స్టార్ డైరెక్టర్ మణిరత్నం ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఈ జంటకు ఒక కొడుకు కూడా జన్మించారు.

ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన ఈమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో అలరిస్తోంది. ఇక మరొకవైపు నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించింది. ఇదిలా ఉండగా సుహాసిని ఒక హీరోయిన్ పెళ్లి చెడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసిందట. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు సుహాసిని ఆ హీరోయిన్ పై అంత పగబట్టింది ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు సుమలత..వీరిద్దరూ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చాలా క్లోజ్ గా ఉండేవారు. అంతేకాదు వీరి మధ్య స్నేహబంధం కూడా మరింత పెరిగింది. ఆ కారణంగానే సుమలత నటుడు అంబరీష్ ని వివాహం చేసుకుంటానని సుహాసినితో చెప్పినప్పుడు.. అతడిని పెళ్లి చేసుకోవద్దు.. నువ్వు సాఫ్ట్ నేచర్ గల దానివి.. ఆయన విలన్.. రౌడీలా ఉంటాడు.. నీకు సెట్ అవ్వడు.. అంటూ ఎన్నో విధాలుగా ప్రయత్నించి పెళ్లి ఆపాలని చూసిందట.

అయినప్పటికీ సుమలత అంబరీష్ ని అప్పటికే గాఢంగా ప్రేమించడంతో సుహాసిని చెప్పిన మాటలు పట్టించుకోలేదు. ఆ తర్వాత సుమలత , అంబరీష్ ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇక వివాహం జరిగిన తర్వాత ఒకరోజు బెంగళూరుకు వెళ్ళిన సుహాసిని.. సుమలత ఇంటికి వెళ్లిందట.. దాంతో సుహాసినిని అక్కడ చూసిన అంబరీష్ … ఏంటమ్మా.. నేను నీకేం అన్యాయం చేశాను.. నా పెళ్లి చెడగొట్టాలని చూసావు.. అంటూ సరదాగా సుహాసినిని అన్నట్లు సమాచారం మొత్తానికైతే ఈ విషయాన్ని సుహాసిని గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఈమె చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు