Tollywood: అడ్డమైన పనులు చేసి అరెస్ట్… నిర్మాతలను టెన్షన్ పెడుతున్న సపోర్టింగ్ యాక్టర్స్

ఇటీవల కాలంలో సపోర్టింగ్ యాక్టర్స్ అరెస్ట్ అవుతున్న న్యూస్ తరచుగా టాలీవుడ్ ఆడియన్స్ వింటూనే ఉన్నారు. సినిమా అవకాశాలు వచ్చి, కాస్తో కూస్తో పేరు రాగానే ఆ పొగరు తలకెక్కి, అడ్డమైన పనులు చేసి అరెస్ట్ అవుతున్నారు ఈ యాక్టర్స్. వాళ్లు అరెస్ట్ అయితే అయ్యారు గానీ, దానివల్ల నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.

నిజానికి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సపోర్టింగ్ యాక్టర్స్, అలాగే కమెడియన్లు చాలా తక్కువ అని చెప్పాలి. ఉన్న కొంతమంది కూడా బిజీ షెడ్యూల్ కారణంగా చాలా సినిమాలకు అందుబాటులో ఉండట్లేదు. ఇక మరోవైపు ఈ రోజుల్లో సినిమా నిర్మాణ బడ్జెట్ అనేక రెట్లు పెరిగిపోతుండడం ఒక తలనొప్పి అయితే, పెద్ద సినిమాల్లో నటిస్తున్న సైడ్ యాక్టర్స్ అనుకొని కారణాలతో అరెస్టు కావడం కొంతమంది బడా నిర్మాతలు, దర్శకులను ఆందోళనకు గురి చేస్తుంది. గతవారం “పుష్ప” ఫేమ్ జగదీష్ అరెస్టు కావడం ఆ పాన్ ఇండియా మేకర్స్ ను ఇబ్బంది పెట్టింది. అతని వల్ల “పుష్ప-2” మూవీ షూటింగ్ ఆలస్యం కాకూడదని, జగదీష్ ను బయటకు తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఇతగాడు “పుష్ప”తో వచ్చిన ఫేమ్ తట్టుకోలేకపోయాడో ఏమో జగదీష్ ఒక వ్యక్తిని బెదిరించడంతో అతను భయపడి ఆత్మహత్య చేసుకునేదాకా వచ్చింది. దీంతో ఈ కమెడియన్ అరెస్టు కాక తప్పలేదు.

ఇక తాజాగా మరో , యూట్యూబ్ చంద్రశేఖర్ సాయి అరెస్టు కావడం ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన మేకర్స్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. “చత్రపతి” హిందీ రీమేక్ తో భారీ ప్లాట్ ను తన ఖాతాలో వేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త చిత్రంలో చందు కీలకపాత్రను పోషిస్తున్నాడు. “భీమ్లా నాయక్” డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీకి “టైసన్ నాయుడు” అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇక గత ఆరు నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చందు సాయి పూర్తిస్థాయి నిడివి ఉన్న పాత్రను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చందు రేప్, మోసం చేయడం వంటి పెద్ద సెక్షన్ల కింద అరెస్టు కావడం నిర్మాతలకు తలనొప్పిగా మారింది. అతని పాత్ర లెంత్ ఎక్కువగా ఉండడంతో చందు లేకుండా షూటింగ్ కొనసాగించడం మేకర్స్ కు కష్టంగా మారినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ పై బెల్లంకొండ శ్రీనివాస్ చాలా ఆశలు పెట్టుకున్నాడట. కానీ చిన్నా చితకం నాటినటులకు సినిమాల్లో ఇలా మంచి అవకాశం వస్తే, అనవసరమైన సమస్యల్లో చిక్కుకుని కటకటాల పాలవుతూ నిర్మాతలను చిక్కుల్లోకి నెడుతున్నారు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా దర్శక నిర్మాతలు ఇప్పుడు వాళ్ళను తమ సినిమాల్లోకి తీసుకున్నందుకు పశ్చాతాప పడుతున్నారు. మరి ఇప్పటికైనా చిత్ర నిర్మాతలు తమ సినిమాల్లోకి తీసుకునే నటీనటుల విషయంలో జాగ్రత్తగా ఉంటారేమో చూడాలి.

- Advertisement -

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు