Venu Swamy: 2026 లోపు ఇద్దరు టాలీవుడ్ హీరోలు, ఓ హీరోయిన్ చనిపోతారు.. వేణు స్వామి స్టేట్మెంట్ వైరల్..!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ ఎంతగానో ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ముఖ్యంగా ఆయన నాగచైతన్య – సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. అలాగే పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవన్నీ జరగడంతో ఆయన సోషల్ మీడియాలో పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. ఇటీవల ప్రభాస్ సినిమాల గురించి వేణు స్వామి చేసిన సంచలన వ్యాఖ్యలు ఫ్యాన్స్ కి కోపం తెప్పించినా.. చివరికి నిజమని ఇప్పుడు ప్రూవ్ అయ్యాయి.

అయితే తాజాగా ఇండస్ట్రీలో ఓ టాలీవుడ్ హీరో సూసైడ్ చేసుకుంటారని.. మరో హీరో చనిపోతారని బాంబు పేల్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.. తులారాశి, వృశ్చిక రాశికి సంబంధించిన హీరో, మిధున రాశికి సంబంధించిన మరో హీరో కూడా చనిపోతాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు వేణు స్వామి. “డేట్ ఆఫ్ బర్త్ తీసి ఏ హీరోనో చెక్ చేసుకోండి.. నేను పేరు చెప్పలేను. 2026 లోపు ఈ ఇద్దరు స్టార్ హీరోలు తప్పకుండా మరణిస్తారు. అందులో ఒకరు సూసైడ్ చేసుకుంటారు. మరొకరు అనారోగ్య సమస్యలతో చనిపోతారు” అని సంచలన కామెంట్స్ చేశారు.

అలాగే ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హెల్త్ పరమైన సమస్యలతో డిస్టర్బ్ అవుతుందని.. ఆమె కూడా చనిపోయే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. మనిషికి ముఖ్యంగా కావలసినవి 1 డబ్బు, 2 రిలేషన్స్, 3 స్టార్ డమ్.. ఇందులో ఏది మిస్ అయినా సెలబ్రిటీలు అస్సలు తట్టుకోలేరు. దీంతో చనిపోయే స్టేజ్ వరకు వెళతారని అన్నారు. ఇలా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ హీరోలు, హీరోయిన్ ఎవరు..? అంటూ ఆందోళన చెందుతుంది ఇండస్ట్రీ.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు