Lavanya Tripathi: అక్కినేని ఫ్యామిలీ చేసిన తప్పే.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ చేస్తుందా..?

అక్కినేని హీరో నాగచైతన్య – స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమాతోనే మంచి స్నేహితులుగా మారారు. అలా కొంతకాలం తర్వాత స్నేహం ప్రేమగా మారి కుటుంబ సభ్యులు అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం చైతన్య – సమంత ఎవరికి వారు వేరువేరుగా కెరీర్ కొనసాగిస్తున్నారు.

అయితే ఈ జంట ఎందుకు విడిపోయారు అన్న విషయం వారు బయట పెట్టకపోవడంతో అనేక రకాల ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. ఇదిలా ఉంటే.. సమంత విషయంలో అక్కినేని ఫ్యామిలీ చేసిన తప్పే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి విషయంలో మెగా ఫ్యామిలీ చేస్తుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలు చేయాలనె ఆలోచన చేయలేదు. చైతుతో హ్యాపీగా ఉంటే చాలని అనుకుంది.

అక్కినేని కుటుంబం కూడా సమంతకి ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు. కానీ పెళ్లయిన కొంత కాలానికి దర్శకులు సమంత వద్దకు రావడం, అవకాశాలు ఇవ్వడం, అక్కినేని కుటుంబం కూడా అడ్డు చెప్పకపోవడంతో సమంత లిమిట్స్ దాటిందని.. ఇదే వీళ్ళ విడాకులకు కారణమైందనే రూమర్ ఉంది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి విషయంలో కూడా మెగా ఫ్యామిలీ ఎటువంటి కండిషన్స్ పెట్టలేదట. దీంతో దర్శకులు లావణ్యతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవేళ ఈ స్ట్రాటజీ అటు ఇటుగా మారితే లావణ్య తీసుకునే నిర్ణయం పరిశ్రమలో కీలకంగా మారబోతుందంటూ చర్చించుకుంటున్నారు సినీ విశ్లేషకులు.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు